కోల్కత్తా: తుర్కిష్ 727 విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఖాట్మండు నుంచి ఇస్తాంబుల్ వెళుతున్న ఈ విమానం కుడి వైపు ఇంజన్ నుంచి పొగలు రావడంతో ఫైర్ వచ్చే ప్రమాదం ఉందని భావించిన కెప్టెన్ కోల్కత్తా ఏటీసీకి సమాచారం ఇచ్చాడు. విమానంలో 236 మంది ప్రయాణికులు ఉండటంతో కోల్ కత్తా విమానాశ్రయంలో ఈ విమానాన్ని పుల్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
Kolkata Airport | Full emergency landing of Turkish 727, from Kathmandu to Istanbul at Kolkata airport. The Captain informed Kolkata ATC about a possible fire on the right engine. The aircraft is at Kolkata airport now. An inspection is going on. https://t.co/tMDpuMNJn3 pic.twitter.com/UYyE2JR7jI
— ANI (@ANI) February 4, 2026
పైలట్ ముందుచూపు కారణంగా పెద్ద ప్రమాదమే తప్పింది. కోల్ కత్తా విమానాశ్రయానిక షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 2 గంటల 49 నిమిషాలకు ఈ విమానం రావాల్సి ఉంది. కానీ.. ఈ విమానం రాక ఆలస్యమైంది. ఈ విమానంలో ఈ సమస్య ఎందుకు తలెత్తిందో దర్యాప్తు చేస్తున్నట్లు కోల్ కత్తా విమానాశ్రయ డైరెక్టర్ తెలిపారు.
