లానినో ఎఫెక్ట్..ఈసారి రికార్డు స్థాయిలో చలి..! మైనస్ డిగ్రీల్లో ఉంటుందట..

లానినో ఎఫెక్ట్..ఈసారి రికార్డు స్థాయిలో చలి..! మైనస్ డిగ్రీల్లో ఉంటుందట..

ఈఏడాది శీతాకాలం(వింటర్​సీజన్)లో చలి రికార్డు స్థాయిలో ఉండనుంది. గతంకంటే ఈసారి రికార్డు స్థాయిలో మైనస్​ డిగ్రీల్లో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంది. లానినో ప్రభావంతో దేశంలో చలి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మామూలు వింటర్​ సీజన్​ లోనే చలిని  తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది.. ఇక లానినో ప్రభావంతో భారత్​ లో మరింత చలి ఇబ్బంది పెట్టొచ్చు..చలినుంచి రక్షించుకునే ఏర్పాట్లు చేసుకోవాలనే సూచిస్తోంది. 

2025 అక్టోబర్​ నుంచి డిసెంబర్​మధ్య71 శాతం లానినో అభివృద్ది చెందే అవకాశం ఉందని భారతదేశంలో శీతాకాలం సాధారణం కంటే అధికంగా చలి ఉండే అవకాశం ఉందని ప్రముఖ వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. డిసెంబర్ -ఫిబ్రవరి 2026కి ఇది 54శాతానికి తగ్గుతుందని చెబుతున్నారు. 

ఎల్ నినో దక్షిణ ఆసిలేషన్ (ENSO) చక్రంలో శీతల దశ అయిన లా నినా.. భూమధ్యరేఖ పసిఫిక్‌లో సముద్ర ఉష్ణోగ్రతలను తగ్గిసత్ఉంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా వాతావరణంపై  ప్రభావం చూపునుంది. ముఖ్యంగా భారత్​ లో సాధారణం కంటే తక్కువ శీతాకాల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశంఉందని వాతావరణ శాఖ చెబుతోంది. 

లా నినా అక్టోబర్-డిసెంబరులో..

భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం..ప్రస్తుతం పసిఫిక్‌లో తటస్థ పరిస్థితులు ఉన్నాయి. అయితే రుతుపవనాల తర్వాత లా నినా పెరిగే ఛాన్స్​ ఉందని  తాజా ENSO బులెటిన్‌లో తెలిపింది. ఈ ఏడాది అక్టోబర్-డిసెంబర్ మధ్య 50శాతం కంటే ఎక్కువ లా నినా అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతోంది. లా నినా వల్ల మనదేశంలో చాలా 
సార్లు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని IMD సీనియర్ అధికారి చెప్పారు. 

ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ వెదర్ కూడా పసిఫిక్‌లో ఉష్ణోగ్రతల తగ్గే సంకేతాలను గుర్తించింది. లానినో ప్రభావంతో పసిఫిక్​ సముద్రం జలాలు, ఉత్తర, హిమాలయ ప్రాంతాల్లో ఎక్కువ హిమపాతాని  దారితీస్తాయని స్కైమెట్ అధ్యక్షుడు జిపి శర్మ అన్నారు. 

IISER మొహాలి, బ్రెజిల్​ లోని నేషనల్​ ఙనిస్టిట్యూట్​ఫర్​ స్పేస్​ రీసెర్చ్​అధ్యయనంలో కూడా భారత్​ పై లానినో ప్రభావం ఉందని తేలింది. లానినో ప్రభావంతో భారత దేశం అంతగా తీవ్ర మైన చలి గాలులు అవకాశం ఉందని తెలిపింది.  ఎల్ నినో  తటస్థ దశలతో పోలిస్తే లా నినాతో ఎక్కువ కాలం,చలి తీవ్రతలు ఉంటాయని పరిశోధనలో తేలింది.