ICMR‎లో సైంటిస్ట్-బి ఉద్యోగాలు.. మార్చి 1 దరఖాస్తుకు చివరి తేదీ

ICMR‎లో సైంటిస్ట్-బి ఉద్యోగాలు.. మార్చి 1 దరఖాస్తుకు చివరి తేదీ

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సైంటిస్ట్– బి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ మార్చి 01.

  • ఖాళీలు: 27.  
  • విభాగాల వారీగా ఖాళీలు: సైంటిస్ట్–బి నాన్ మెడికల్ 25, సైంటిస్ట్–బి నాన్ మెడికల్ ఐటీ/ కంప్యూటర్ సైన్స్ 01,  సైంటిస్ట్-–బి నాన్ మెడికల్ ఫార్మకాలజీ 01.
  • ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బయో మెడికల్ సైన్సెస్‌లో మాస్టర్స్ డిగ్రీ / ఎంఈ/ ఎం.టెక్. కంప్యూటర్ సైన్స్ / ఫార్మసీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. 
  • గరిష్ట వయోపరిమితి: 35 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
  • అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 
  • అప్లికేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 02. 
  • లాస్ట్ డేట్: మార్చి 01. 
  • అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.3000. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.2400. 
  • సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
  • పూర్తి వివరాలకు www.aiimsexams.ac.in వెబ్​సైట్​ను సందర్శించండి.