ఇక సమరమే.. ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో పోటీదారుల సంఖ్య 1,077

ఇక సమరమే.. ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో పోటీదారుల సంఖ్య 1,077
  • మంగళవారం మధ్యాహ్నంతో ముగిసిన విత్‍ డ్రా గడువు 
  • అభ్యర్థులకు గుర్తులు కేటాయించిన అధికారులు 
  • 6 జిల్లాల్లో 12 మున్సిపాలిటీలు, 260 వార్డులు
  • 11న ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోనున్న పార్టీలు, క్యాండిడేట్లు

వరంగల్/ నెట్‍ వర్క్, వెలుగు: ఓరుగల్లు మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటర్‍ తీర్పు కోసం సై అంటే సై అంటూ బరిలో నిలిచిన క్యాండిడేట్ల సంఖ్య తేలింది. ఉమ్మడి వరంగల్ 6 జిల్లాల్లోని 12 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 260 వార్డులున్నాయి. గత నెల 27న ఎన్నికల నగారా మోగగా, 30వ తేదీ నాటికి నామినేషన్లు స్వీకరించారు. ఆపై ఆఫీసర్లు చేసిన స్క్రూట్నీలో సరైన వివరాలు ఇవ్వని నామినేషన్లను తిరస్కరించారు.

ఎవరైనా పోటీనుంచి విత్‍డ్రా చేసుకోడానికి మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఎలక్షన్‍ కమిషన్‍ గడువు ఇచ్చింది. పలువురు క్యాండిడేట్లు పోటీనుంచి వైదొలుగుతూ తమ నామినేషన్లు వెనక్కు తీసుకున్నారు. దీంతో మొత్తం 12 మున్సిపాలిటీల్లో ఫైనల్‍గా1,077 మంది ఎన్నికల బరిలో నిలిచారు. ఫైనల్​గా బరిలో ఉన్న అభ్యర్థులకు ఈసీ అధికారులు గుర్తులు సైతం కేటాయించారు. దీంతో ఈనెల 11న నిర్వహించబోయే మున్సిపల్‍ ఎన్నికల్లో పార్టీలు, క్యాండిడేట్లు తాడోపేడో 
తేల్చుకోనున్నారు. 

ఉపసంహరణ ప్రక్రియ పరిశీలన

జనగామ అర్బన్ : జనగామ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ పనులను అడిషనల్​ కలెక్టర్ పింకేశ్​కుమార్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా  అభ్యర్థులు, ఎన్నికల సిబ్బంది, కౌంటర్ల నిర్వహణ, రికార్డు నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు సమయపాలనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం జనగామ పట్టణంలోని ఏకశిలా బీఎడ్​ కాలేజీలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సెంటర్ ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీవో గోపీరామ్, మున్సిపల్​ కమిషనర్​ మహేశ్వర్ రెడ్డి, తహసీల్దార్ మోహసీన్,  మాస్టర్ ట్రైనర్ మెరుగు బాలరాజు, లైన్ డిపార్ట్​మెంట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

స్క్రూట్నీ, మంగళవారం విత్‍ డ్రా అనంతరం బరిలో నిలిచినవారు  


మున్సిపాలిటీ    వార్డులు    నామినేషన్లు    పోటీదారులు

నర్సంపేట             30                     291                  120

వర్ధన్నపేట             12                     121                   50

పరకాల                    22                     215                  100

ములుగు                  20                     199                   83

భూపాలపల్లి            30                     230                  107

జనగామ                   30                    186                  127

స్టేషన్ ఘన్​పూర్    18                      114                  82

తొర్రూర్                    16                     195                  63

కేసముద్రం              16                      220                63

డోర్నకల్                   15                      196                64

మరిపెడ                   15                       178               63

మహబూబాబాద్     36                        312               155

మొత్తం                    260                      2,630           1,077