ఒప్పో కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు.. నాన్ స్టాప్ ప్లేబ్యాక్.. ధర కూడా తక్కువే..

ఒప్పో కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు.. నాన్ స్టాప్ ప్లేబ్యాక్.. ధర కూడా తక్కువే..


ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ఒప్పో కొత్త Oppo K14xని  వచ్చే వారం ఇండియాలో లాంచ్ చేయనుంది. అయితే Oppo కొత్త K-సిరీస్ తో  వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ లేటెస్ట్ ఫీచర్లను ప్రకటించింది. గత ఏడాది జూన్‌లో లాంచ్ చేసిన  Oppo K13x 5Gకి  ఈ ఫోన్ అప్ గ్రేడ్ వెర్షన్. 

Oppo K14x  సేల్స్ కోసం ఒక ప్రత్యేక మైక్రోసైట్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో చూడొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 6.75-అంగుళాల డిస్‌ప్లే, పెద్ద 6,500mAh బ్యాటరీ, మీడియాటెక్ చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది.

 లాంచ్ తేదీ, వివరాలు
Oppo K14x ఇండియాలో ఫిబ్రవరి 10న లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 6300 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుందని, ColorOS 15పై రన్ అవుతుందని Oppo తెలిపింది.

ALSO READ : జీఎస్టీ తగ్గింపుతో కార్ల అమ్మకాల జోరు


ఫ్లిప్‌కార్ట్ టీజర్ ప్రకారం, ఒప్పో K14x K-సిరీస్ డిజైన్ చూస్తే ఫ్లాట్ అంచులు, ఫ్లాట్ రియర్ ప్యానెల్, పిల్-ఆకారపు బ్యాక్ కెమెరా మాడ్యూల్‌ ఉంటుంది. బ్యాక్  కెమెరా సెటప్‌లో LED ఫ్లాష్‌తో పాటు రెండు కెమెరా సెన్సార్లు ఉంటాయి.


 Oppo K13x 5G ధర 
Oppo K13x 5Gకి అప్ గ్రేడ్ వెర్షన్ Oppo K14x  ఒకే డిజైన్‌తో ఉంటుంది.  4GB RAM, 128GB స్టోరేజ్‌తో Oppo K13x 5G బేస్ వేరియంట్‌ను రూ. 11,999 ధరకు లాంచ్ చేసారు. అయితే ఒప్పో  K14x  కూడా అదే రేంజ్ ధరతో రావొచ్చు, దీని పై Oppo ఇంకా ఎలాంటి విషయాన్నీ వెల్లడించలేదు.

  డిస్ ప్లే కెమెరా&  బ్యాటరీ 
Oppo K14x 120Hz రిఫ్రెష్ రేట్, 1,125 nits పీక్ బ్రైట్‌నెస్‌తో 6.75-అంగుళాల HD+ డిస్‌ప్లే ఉంటుంది. ఫోటోగ్రఫీ పరంగా  50-మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంటుంది, దీనికి చాలా AI ఇమేజింగ్ ఫీచర్లు సపోర్ట్ ఇస్తాయి.

ALSO READ : ఇండియాలో EC-06 పేరుతో యమహా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..

ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,500mAh బ్యాటరీతో  వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 17.6 గంటల యూట్యూబ్ వీడియో ప్లేబ్యాక్, 16.1 గంటల గూగుల్ మ్యాప్స్ నావిగేషన్,  12.1 గంటల వాట్సాప్ వీడియో కాలింగ్‌ సింగిల్ పూర్తి ఛార్జ్‌తో అందించగలదని ఒప్పో పేర్కొంది.