ఇండియాలో EC-06 పేరుతో యమహా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్స్ చూస్తే వావ్ అనాల్సిందే..

 ఇండియాలో EC-06 పేరుతో యమహా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్స్ చూస్తే వావ్ అనాల్సిందే..

ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా ఇండియాలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్  యమహా EC-06ను విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ బెంగళూరుకు చెందిన స్టార్టప్ రివర్ సహకారంతో అభివృద్ధి చేశారు. యమహా EC-06 ధర రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ కంటే రూ.22 వేలు ఎక్కువ.

బ్యాటరీ, మోటార్ & మైలేజ్ 
యమహా EC-06 4kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్  రివర్ ఇండీ లాగానే  6.7kW శక్తిని ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటారుతో తీసుకొచ్చారు. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 79 కిలోమీటర్ల స్పీడ్ తో ప్రయాణిస్తుంది,  రివర్ ఇండీ కంటే 11 కిలోమీటర్లు తక్కువ. అయితే ఒక ఫుల్ ఛార్జ్ పై 169 కిలోమీటర్లు వెళ్తుంది, ఈ రేంజ్ ఇండీ కంటే 6 కిలోమీటర్లు ఎక్కువ.

ఛార్జింగ్ వివరాలు:
యమహా కంపెనీ 8 గంటల్లో 0–80 శాతం ఛార్జింగ్ అవుతుందని క్లెయిమ్ చేస్తుంది, దీనిని 480W ఛార్జర్‌ని ఉపయోగించి ఛార్జ్ చేయవచ్చు. అయితే, రివర్ ఇండీ ఫాస్టెస్ట్ 750W ఛార్జర్‌  కూడా అందిస్తుంది. 

యమహా EC-06 ఫీచర్స్ & స్టోరేజ్ 
యమహా EC-06 రివర్ ఇండీ లాగానే ఛాసిస్, ఫీచర్స్ ఉంటాయి.  కలర్ LCD డిస్ ప్లే, మూడు రైడింగ్ మోడ్‌లు, రివర్స్ అసిస్ట్‌తో వస్తుంది. స్టోరేజ్ పరంగా, స్కూటర్ 24.5 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్‌తో పాటు ముందు ఆప్రాన్‌లో ఓపెన్ క్యూబీని అందిస్తుంది.

యమహా EC-06 డిజైన్
రివర్ ఇండీ  బాక్సీ & యుటిలిటేరియన్ డిజైన్‌తో పోలిస్తే, యమహా EC-06 స్లీక్ అండ్ షార్ప్ డిజైన్‌ తో ఉంటుంది. EC-06 లోని హెడ్‌ల్యాంప్, టెయిల్-ల్యాంప్ మంచి రూపాన్ని ఇస్తాయి.

Yamaha EC-06 ధర 
యమహా EC-06 ధర రూ. 1.68 లక్షలు (ఎక్స్-షోరూమ్, మహారాష్ట్ర). ప్రస్తుతం, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులలో మాత్రమే అందుబాటులో ఉంది.