
వారఫలాలు: జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మేషరాశి నుంచి .. మీనరాశి వరకు ఈ వారం ( సెప్టెంబర్ 14 నుంచి సెప్టెంబర్ 20 వరకు ) రాశి ఫలాలను తెలుసుకుందాం.
మేష రాశి: ఈ రాశి వారికి ఈ వారం గతంలో కంటే మెరుగ్గా ఉండే అవకాశాలున్నాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు చాలా అనుకూలంగా ఉందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. అనుకోకుండా గతంలో పెట్టిన పెట్టుబడులకు అధికంగా లాభాలు వస్తాయి. వారం మొదట్లో ఖర్చులు కొద్దిగా అధికంగా ఉంటాయి. ఉద్యోగస్తులు కార్యాలయంలో కీలక పాత్ర పోషిస్తారు. నిరుద్యోగులు గుడ్ న్యూస్ వింటారు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి. ఎలాంటి ఇబ్బంది ఉండదు. జీవితం హ్యాపీగా కొనసాగిపోతుంది.
వృషభరాశి: ఈ రాశి వారికి ఈ వారం ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. కొంతమంది ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. పాత మిత్రులు కలుసుఉంటారు. అనుకోకుండా పూర్వీకుల ఆస్తి కలసి వస్తుంది. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగస్తులకు గతంలో ఉన్న ఇబ్బందులు పరిష్కారమవుతాయి. ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు. వారం చివరిలో అనవసర ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
మిధునరాశి: ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న కొన్ని ముఖ్యమైన పనులు నెరవేరే అవకాశం ఉంది. గతంలో ఆగిపోయిన పనుల్లో ఈ వారంలో పురోగతి ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. ఉద్యోగస్తులు ప్రమోషన్ పొందేందుకు రూట్ క్లియర్ అవుతుంది. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ లభిస్తుంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ వారమంతా సంతృప్తికరంగా సాగిపోతుంది.
కర్కాటకరాశి: ఈ రాశి వారు ఈ వారం శుభ వార్తలు వినే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు వస్తాయి. పూర్వీకుల ఆస్తి కలసి వస్తుంది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. నిరుద్యోగులు మంచి ఆఫర్లు అందుకుంటారు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.
సింహరాశి: ఈ రాశి వారు ఈ వారం కొన్ని సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రశాంతంగా... ఆనందంగా.. జీవితం కొనసాగిస్తారు. వృత్తి .. వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. చేతి వృత్తుల వారకి అనుకోకుండా కొత్త ఆర్డర్లు వస్తాయి. ఉద్యోగస్తుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నిరుద్యోగులకు ఉన్న ప్రదేశంలో జాబ్ వచ్చే అవకాశాలున్నాయని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. కొన్ని అనవసర ప్రయాణాలు ఆందోళన కలిగించే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. బంధు వర్గంలోని వారితో పెళ్లి సంబంధం నిశ్చయమవుతుంది.
కన్యారాశి: ఈ రాశి వారు ఈ వారం ముఖ్యమైన కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఉద్యోగస్తులు జాబ్ మారే అవకాశాలున్నాయి. ఆఫీసులో కీలక పాత్ర పోషిస్తారు. కొత్త ప్రాజెక్ట్‌లో ఒప్పందాలు కుదురుతాయి. చేతి వృత్తుల వారికి.. వ్యాపారస్తులకు ఆదాయం పెరుగుతుంది. కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కొన్ని శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి.
తులారాశి: ఈ రాశి వారు ఈవారం ఆరోగ్య విషయంలో అప్రతమత్తంగా ఉండాలి. వారం మధ్యలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారస్తులు... ఉద్యోగస్తులు అధికంగా శ్రమ పడాల్సి ఉంటుంది. ఎవరితోను ఎలాంటి వాదనలు పెట్టుకోవద్దు. మీ పని మీరు చేసుకోండి. ఎవరు ఏమన్నా పట్టించుకోకపోవడం చాలా మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. ప్రతి విషయంలోనూ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆధ్యాత్మిక చింతనతో గడపండి.. అంతా మంచే జరుగుతుంది.
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఈ వారం కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. గతంలో రావలసిన బకాయిలు వసూలవుతాయి. కొత్తగా ఇల్లు నిర్మాణానికి వేసిన ప్లాన్ సఫలం అవుతుంది. అనుకోకుండా కొన్ని కొత్త సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపారస్తులకు అంచనాలకు మించిన లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కొత్త వ్యాపారాలు.. నూతన పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల సమయమని పండితులు సూచిస్తున్నారు. ప్రేమ... పెళ్లి వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి.
ధనస్సు రాశి: ఈ రాశి వారికి ఈ వారం విదేశీ ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. అనుకున్న అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్‌తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు పొందుతారు. వ్యాపారస్తులకు అధికంగా లాభాలు వస్తాయి. చేతి వృత్తుల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు మంచి జాబ్ ఆఫర్ వస్తుంది. జీవితం ఉత్సాహంగా .. ఉల్లాసంగా సాగిపోతుంది. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.
మకరరాశి: ఈ రాశి వారు ఈ వారం బాగా ఎంజాయి చేసే పరిస్థితులు ఉన్నాయని పండితులు సూచిస్తున్నారు. నిరుద్యోగులు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుకుంటారు. వ్యాపారస్తులు కొత్తగా బ్రాంచ్‌లు పెట్టేందుకు ప్లాన్ చేసే అవకాశాలున్నాయి. చేతి వృత్తుల వారికి ఆర్డర్లు అధికంగా వస్తాయి. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కొద్దిపాటి ప్రయత్నంలోఅనుకున్న పెళ్లి సంబంధం చేజారి పోతుంది. వ్యక్తిగత సమస్యలు.. ఆర్థిక లావాదేవీల్లో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని పండితులు చెబుతున్నారు.
కుంభరాశి: ఈ రాశి వారికి ఈ వారం కొన్ని ముఖ్యమైన సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు. ఉద్యోగస్తులకు .. వ్యాపారస్తులకు పనిభారం పెరుగుతుంది. అదనపు ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. ఉద్యోగం మారాలనుకునే వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. ఎంప్లాయీస్ శుభవార్తలు వింటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. సమాజంలో గౌరవం.. కీర్తి.. ప్రతిష్టలు పెరుగుతాయి. మిమ్ములను నమ్మించి మోసం చేసే అవకాశాలున్నాయి. ఇతరులు చెప్పిన విషయాలపై ఆధారపడి నిర్ణయం తీసుకొనేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
మీన రాశి: ఈ రాశి వారికి ఈ వారం ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు కలుగుతాయి. ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఎదురవుతాయి. వారం మధ్య నుంచి సొంత నిర్ణయాలు అమలు చేయడంతో పరిస్థితులు అనుకూలిస్తాయి. స్థిరాస్థి విషయంలో కొత్త ఒప్పందాలు జరగడంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారస్తులకు గతంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగస్తులు హ్యాపీగా గడుపుతారు. ఆర్థికపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.