హైదరాబాద్ లో కుండపోత..నీటమునిగిన కాలనీలు.. చెరువులను తలపిస్తోన్న రోడ్లు

హైదరాబాద్ లో కుండపోత..నీటమునిగిన కాలనీలు.. చెరువులను తలపిస్తోన్న రోడ్లు

 హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో  రెండు గంటల పాటు కుండపోత వాన పడింది. రోడ్లు, కాలనీలు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపై కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కొన్ని చోట్ల వాహనాల్లో వరదల్లో కొట్టుకుపోయాయి. ముషిరాబాద్,  మల్కాజ్ గిరి, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదయ్యింది.

 ముషిరాబాద్ లో  అత్యధికంగా 12 సెం.మీ వర్షపాతం ,మారేడుపల్లి, షేక్ పేట,  కాప్రా లో   9 సెం.మీ. వర్షపాతం నమోదయ్యింది. జూబ్లీహిల్స్ లో  8సెం.మీ. హిమాయత్ నగర్ లో 7.7 సెం.మీ మల్కాజ్ గిరిలో  7.6, ఉప్పల్ లో 7.5, అల్వాల్ లో 7.4, శేర్లింగంపల్లిలో 7.1. నాంపల్లిలో 7 సెం.మీ వర్షపాతం నమోదయ్యింది. 

 బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12 కమాండ్ కంట్రోల్ దగ్గర రోడ్డు పైన భారీగా  వర్షపు నీరు నిలిచిపోయింది . సరూర్ నగర్, కొత్తపేట,చైతన్య పురి, దిల్ సుఖ్ నగర్, ముసారాంబాగ్, మలక్ పేట, చాదర్ ఘాట్, IS సధన్, మదన్న పేట, చంపాపేట్, కర్మన్ ఘాట్ పరిసర ప్రాంతాల్లో  భారీ వర్షం పడుతోంది.   లోతట్టు కాలనీల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే మాత్రమే బయటకు రావాలని అధికారులు హెచ్చరించారు.