
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ మళ్ళీ వచ్చేస్తోంది. ఈ సేల్ స్మార్ట్‌ఫోన్ ప్రియులకు ఒక పండుగ లాంటిది. ఎందుకంటే ఈ సేల్‌లో చాల ఫోన్‌లు రూ.25 వేలకంటే తక్కువ ధరకే అది కూడా డిస్కౌంట్లో అందిస్తుంది. ఈ ఫోన్స్ మంచి పర్ఫార్మెన్స్, బెస్ట్ కెమెరా క్వాలిటీ, ఎక్కువకాలం ఉండే బ్యాటరీ లైఫ్ కోరుకునేవారికి మంచి ఛాయిస్. ఈసారి సేల్‌లో కొన్ని సెలెక్ట్ చేసిన మోడళ్లపై అందిస్తున్న డిస్కౌంట్లు కస్టమర్లను ఎంతో ఆకర్షిస్తున్నాయి.... అవేంటంటే...
ఈ లిస్టులో రియల్‌మీ పి3ఎక్స్ అత్యంత చౌకైన స్మార్ట్‌ఫోన్. దీనికి 6.72-అంగుళాల FHD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 6400 5G చిప్‌సెట్ ఉంది. ఈ ఫోన్ 6000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. దీని అసలు ధర రూ. 12,999, కానీ ఆఫర్‌లో రూ.11,874కే వస్తుంది.
ఎవరైనా స్టైలిష్, పవర్ ఫుల్ అప్షన్స్ కోరుకుంటే నథింగ్ ఫోన్ 2 ప్రో ఒక బెస్ట్ అప్షన్. దీనికి 6.77-అంగుళాల AMOLED డిస్ ప్లే, డైమెన్సిటీ 7300 ప్రో ప్రాసెసర్ ఉంది. ట్రిపుల్ కెమెరా సెటప్‌లో 50MP + 50MP + 8MP లెన్స్ ఇంకా 16MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 5000mAh బ్యాటరీతో ఈ ఫోన్ ధర రూ.18,999 కానీ రూ.17,099కే లభిస్తుంది.
గేమింగ్, హై పర్ఫార్మెన్స్ ప్రియులకు Poco M7 Plus బంపర్ డీల్. 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇచ్చే 6.9-అంగుళాల FHD+ డిస్‌ప్లే దీనిలో ఉంది. స్నాప్‌డ్రాగన్ 6s Gen 3 చిప్‌సెట్‌తో నడిచే ఈ ఫోన్ భారీ 7000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. ఈ సేల్ లో దీని ధర రూ.14,499 నుండి రూ.13,774కి తగ్గింది.
మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ కూడా ఈ ధర విభాగంలో ఒక గొప్ప అప్షన్. 6.67-అంగుళాల P-OLED ప్యానెల్, డైమెన్సిటీ 7400 ప్రాసెసర్, 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5500mAh బ్యాటరీ ఉంది. దీని డ్యూయల్ రియర్ కెమెరా (50MP + 13MP), 32MP ఫ్రంట్ కెమెరా ఫోటోగ్రఫీ పరంగా బెస్ట్ చేస్తుంది. దీని అసలు ధర రూ. 25,999 కానీ ఆఫర్ కింద రూ.24,699కే లభిస్తుంది.
చివరగా Vivo T4x కూడా ఈ రేంజ్లో బలమైన స్మార్ట్‌ఫోన్. దీనికి 6.72-అంగుళాల IPS LCD డిస్‌ప్లే, డైమెన్సిటీ 7300 ప్రాసెసర్, 44W ఛార్జింగ్‌తో వచ్చే 6500mAh బ్యాటరీ ఉంది. డ్యూయల్ కెమెరా సెటప్ (50MP + 2MP), 8MP సెల్ఫీ కెమెరా దీన్ని మరింత బెస్ట్ చేస్తాయి. ఈ ఫోన్ రూ.14,999కు కాకుండా రూ.13,774కే సొంతం చేసుకోవచ్చు.