ఆపిల్ కొత్త స్మార్ట్ హోమ్ డివైజ్.. మాట్లాడితే చాలు.. ఇంట్లోని లైట్లు, కెమెరాలు అన్నీ కంట్రోల్ చేయొచ్చు.. ఎన్ని ఫీచర్లు ఉన్నాయో !

 ఆపిల్ కొత్త స్మార్ట్ హోమ్ డివైజ్..  మాట్లాడితే  చాలు.. ఇంట్లోని లైట్లు, కెమెరాలు అన్నీ కంట్రోల్ చేయొచ్చు.. ఎన్ని  ఫీచర్లు ఉన్నాయో !

అమెరికన్ టెక్ కంపెనీ ఆపిల్  కొత్త స్మార్ట్ హోమ్ డివైజ్‌ అయిన హోమ్‌వ్యూను పరిచయం చేసింది. ఇంట్లోని స్మార్ట్ డివైజెస్ అన్నిటిని ఒకే చోట నుంచి ఈజీగా  కంట్రోల్ చేసేలా దీన్ని రూపొందించింది. వాయిస్ కమాండ్లతో పనిచేసే ఈ డివైజ్, ముఖాన్ని గుర్తించి ఇంట్లోని ప్రతి ఒక్కరికీ వారి అవసరాలకు తగ్గట్టుగా సేవలు అందిస్తుంది. అయితే ఆపిల్ వెబ్‌సైట్‌లో దీని ధర రూ. 39,900గా ఉంది.

7 అంగుళాల టచ్‌స్క్రీన్.. బటన్లు లేని డిజైన్
హోమ్‌వ్యూలో 7 అంగుళాల లిక్విడ్ రెటినా టచ్‌స్క్రీన్ ఉంటుంది. ఇందులో ఎలాంటి ఫిజికల్ బటన్లు ఉండవు. ఐఫోన్, ఐప్యాడ్‌లలో కనిపించే విధంగా యాప్స్‌ను గ్రిడ్ రూపంలో చూపిస్తుంది. దీనివల్ల యాప్స్‌ను ఉపయోగించడం, స్మార్ట్ హోమ్ డివైజెస్ కంట్రోల్ చేయడం  ఈజీ అవుతుంది.

ఈ డిస్‌ప్లే డోమ్ ఆకారంలో ఉండే స్పీకర్ బేస్‌కు స్టెయిన్‌లెస్ స్టీల్ హింజ్ ద్వారా కనెక్టయి  ఉంటుంది. దీన్ని అవసరానికి తగ్గట్టుగా వంచి స్క్రీన్‌ను సౌకర్యవంతంగా చూసుకోవచ్చు.

ఇంట్లోని అన్ని  చోట్ల ఉపయోగించేందుకు వీలుగా ఇందులో ట్రూ టోన్ టెక్నాలజీని అందించారు. ఇది చుట్టూ ఉన్న వెలుతురుకు అనుగుణంగా స్క్రీన్ బ్రైట్‌నెస్‌ను అడ్జస్ట్  చేస్తుంది. బ్రైట్‌నెస్‌ను 500 నిట్స్ నుంచి 0.3 నిట్స్ వరకు మార్చుకోవచ్చని చెబుతుండగా... గోడకు అమర్చుకునే మోడల్ కూడా ఉందని చెబుతున్నారు .

ఆరుగురి ముఖాలను గుర్తించే స్మార్ట్ హబ్
హోమ్‌వ్యూ ప్రత్యేకతల్లో ముఖ్యమైనది ఫేస్ రికగ్నిషన్ ఫీచర్. ఈ ఫీచర్  ఇంట్లోని ఆరుగురు వ్యక్తులను గుర్తించగలదు. ప్రతి ఒక్కరికీ వారి అవసరాలకు తగ్గట్టుగా యాప్స్, విడ్జెట్స్, ఇతర వివరాలను చూపిస్తుంది.

ఉదాహరణకు, ఒక వ్యక్తికి సంబంధించిన క్యాలెండర్ వివరాలు, యాప్స్ లిస్ట్ అతనికి మాత్రమే కనిపించేలా పర్సనల్ అనుభవాన్ని అందిస్తుంది. అదే సమయంలో కుటుంబ సభ్యులందరూ కలిసి ఫోటోలు చూడటం, మ్యూజిక్ వినడం వంటి ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు.

సిరితో మరిన్ని పనులు
ఆపిల్ కొత్తగా అందిస్తున్న సిరి ఏఐ అసిస్టెంట్‌తో హోమ్‌వ్యూ పనిచేస్తుంది. వాయిస్ కమాండ్ల ద్వారా మెసేజులు పంపడం, క్యాలెండర్‌లో మార్పులు చేయడం, ఆపిల్ మ్యూజిక్ ప్లేలిస్టులను సెట్ చేయడం  వంటి పనులు చేసుకోవచ్చు.

ఆపిల్ ఎకోసిస్టమ్‌లోని ఇతర డివైజెస్లతో  కూడా సిరి కనెక్టయి పనిచేస్తుంది. దీంతో ఒక డివైజ్లో  ప్రారంభించిన పనులను మరో డివైజ్లోను    కొనసాగించుకోవచ్చు. సిరితో మాట్లాడే విధానం మరింత సహజంగా ఉండేలా ఇంటర్‌ఫేస్‌ను కూడా రూపొందించారు.

ఫోటో ఫ్రేమ్‌లా కూడా ఉపయోగించుకోవచ్చు
హోమ్‌వ్యూలో ఫోటోల కోసం ప్రత్యేక విభాగం ఉంటుంది. ఇందులో పర్సనల్  ఫోటోలను, కుటుంబ సభ్యులతో షేర్ చేసుకున్న ఆల్బమ్‌లను చూసుకోవచ్చు. దీంతో ఈ డివైజ్ స్మార్ట్ హోమ్ హబ్‌గానే కాకుండా డిజిటల్ ఫోటో ఫ్రేమ్‌లా కూడా ఉపయోగించుకోవచ్చు.

పవర్ ఫుల్ ఆడియో సిస్టమ్
హోమ్‌వ్యూలో మ్యూజిక్ ని బెస్ట్ క్వాలిటీతో వినేందుకు ప్రత్యేకమైన ఆడియో సిస్టమ్‌ను అందించారు. ఇందులో రెండు ఫుల్‌రేంజ్ డ్రైవర్లు, ఒక డౌన్‌ఫైరింగ్ వూఫర్, రెండు ఫోర్స్ క్యాన్సిలింగ్ పాసివ్ రేడియేటర్లు ఉంటాయి. ఆపిల్ సిలికాన్, రియల్‌టైమ్ సెన్సార్ల సాయంతో సౌండ్‌ను ఎప్పటికప్పుడు అడ్జస్ట్ చేస్తుంది. దీనివల్ల తక్కువ లేదా ఎక్కువ వాల్యూమ్‌లోనూ బెస్, సౌండ్ క్వాలిటీని  బెస్ట్ ఉంచుతుంది.

ఇంట్లోని స్మార్ట్ డివైజెస్లన్నిటికి  ఒకే డాష్‌బోర్డ్
హోమ్‌వ్యూను స్మార్ట్ హోమ్ కంట్రోల్ సెంటర్‌గా ఉపయోగించుకోవచ్చు. దీనికి అనుకూలంగా ఉండే కెమెరాలు, లైట్లు, థర్మోస్టాట్‌లు, డోర్ లాక్‌లు, విండో బ్లైండ్‌లను టచ్ లేదా సిరి వాయిస్ కమాండ్ల ద్వారా కంట్రోల్ చేయవచ్చు.

అంతేకాదు, ఒకేసారి తొమ్మిది కెమెరాల వరకు లైవ్ ఫీడ్స్  చూడవచ్చు. అనుకూలమైన కెమెరాలు, ఐక్లౌడ్+ సబ్‌స్క్రిప్షన్ ఉంటే వ్యక్తులు, పరిచయమైన ముఖాలు, పెంపుడు జంతువులు, పార్సిళ్లు, వాహనాలను గుర్తించే సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయి.

హోమ్‌కిట్ సెక్యూర్ వీడియో ద్వారా రికార్డైన ఫుటేజ్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. అలాగే పొగ లేదా కార్బన్ మోనాక్సైడ్ అలారం శబ్దాలను గుర్తించినప్పుడు, యూజర్ ఆపిల్ డివైజెస్లకు అలర్ట్స్ పంపే సదుపాయం కూడా ఉంది.

ఆపిల్ హోమ్   డివైజెస్లకు సపోర్ట్
హోమ్‌వ్యూ ఆపిల్ హోమ్అ నుకూలమైన ఇతర స్మార్ట్ హోమ్ యాక్సెసరీలకు సపోర్ట్ చేస్తుంది. దీంతో ఇంట్లోని వివిధ డివైజేస్లను  ఒకే డాష్‌బోర్డ్‌ నుంచి కంట్రోల్ చేయవచ్చు.

LG ఎలక్ట్రానిక్స్, ష్నైడర్ ఎలక్ట్రిక్ భాగస్వామ్యంతో రూపొందించిన ఆపిల్ హోమ్ కలెక్షన్‌లోని కెమెరాలు, స్మార్ట్ లాక్‌లు, ఇతర యాక్సెసరీలతో కూడా పనిచేస్తుంది. 

డేటా సేఫ్టికి ప్రత్యేక ప్రాధాన్యం
వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని రక్షించేందుకు హోమ్‌వ్యూలో A18 చిప్‌ను ఉపయోగించారు. ఇందులోని సెక్యూర్ ఎక్స్‌క్లేవ్ టెక్నాలజీ కెమెరా, మైక్రోఫోన్‌కు సంబంధించిన డేటాను ఇతర సిస్టమ్ భాగాల నుంచి వేరుగా, సేఫ్ వాతావరణంలో ప్రాసెస్ చేయడానికి సహాయపడుతుంది. దీంతో వ్యక్తిగత సమాచారం భద్రంగా ఉండేలా ఎక్స్ట్రా రక్షణ కల్పించడమే ఆపిల్ లక్ష్యం.

మొత్తంగా ఎలా ఉందంటే ?
హోమ్‌వ్యూ ద్వారా స్మార్ట్ హోమ్ డివైజెస్లను కంట్రోల్ చేయడం, కుటుంబ సభ్యులకు వ్యక్తిగత సేవలు అందించడం, మ్యూజిక్ వినడం, ఫోటోలు చూడటం, ఇంటి భద్రతను పర్యవేక్షించడం వంటి పనులను ఒకే డివైజ్ తో చేసుకునే అవకాశం ఉంటుంది.

ముఖ్యంగా ఇప్పటికే ఆపిల్ డివైజెస్లను  ఉపయోగిస్తున్న వారికి ఇది మరింత ఉపయోగకరంగా ఉండవచ్చు. అయితే కొనుగోలు చేసే ముందు దీని ధర, అందుబాటులో ఉన్న ఫీచర్లు, ఇతర డివైజెస్లతో  కనెక్టివిటీ వివరాలను ఆపిల్ అధికారిక వెబ్‌సైట్‌లో చూడడం మంచిది.