హైదరాబాద్, వెలుగు:టాటా స్టీల్ కలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కలర్ కోటెడ్ ఉక్కు ఉత్పత్తులను ముంబైలో విడుదల చేసింది. యూరోపియన్ దేశాల నైపుణ్యం, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ఈ ఉత్పత్తులు దేశీయ మౌలిక వసతుల రంగానికి ఎంతో ఉపయోగపడతాయి.
వేడి వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ప్రత్యేకంగా రూపొందించిన ఈ కోటింగ్ టెక్నాలజీ రంగు మన్నికను పెంచుతుంది. తుప్పు పట్టకుండా రక్షణ కల్పించడం, గీతలు పడకుండా చూడటంలో ఇది మెరుగైన పనితీరు చూపుతుంది.
జంషెడ్‌పూర్‌లోని అత్యాధునిక కర్మాగారంలో ఇవి తయారవుతాయి. మెట్రో రైలు ప్రాజెక్టులు, పెద్ద గిడ్డంగులు, ఆటోమొబైల్ పరిశ్రమలు, ఆధునిక వాణిజ్య సముదాయాల నిర్మాణంలో కలర్కోట్ స్టీల్ కీలక పాత్ర పోషిస్తుంది. భవిష్యత్‌కు తగినట్లుగా పర్యావరణ హితమైన, మన్నికైన నిర్మాణ సామగ్రిని అందించడమే తమ లక్ష్యమని టాటా స్టీల్ తెలిపింది.
