
ఆసియా కప్ లో ఇండియా- పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. మంగళవారం (సెప్టెంబర్ 14) దుబాయ్ వేదికగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రారంభమైన ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే టాస్ గెలిచిన తర్వాత పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా.. ఇండియా కెప్టెన్ సూర్య ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు. మొదట టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ మ్యాచ్ గురించి మాట్లాడి తలదించుకుని వెళ్ళిపోయాడు. ఇండియా కెప్టెన్ సూర్య కూడా సల్మాన్ ను పట్టించుకోలేదు.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత రెండు జట్లు ఆడుతున్న తొలి మ్యాచ్ ఇదే. దీంతో ఇరు జట్లు ఫార్మాలిటీగా మ్యాచ్ ఆడడానికి వచ్చామని చెప్పకనే చెప్పారు. మ్యాచ్ కు ముందు పాకిస్థాన్ తో ఇండియా మ్యాచ్ ఆడకూడదని.. బాయ్ కాట్ చేయాలని దేశ వ్యాప్తంగా నిరసనలు జరిగిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో బాయ్ కాట్ ఇండియా వర్సెస్ పాక్ హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. టెర్రరిస్టులతో క్రికెట్ వద్దు అంటూ కామెంట్లు చేశారు. అంతేకాదు ఈ మ్యాచ్‌ను చూడకుండా టీవీలు ఆఫ్ చేసి పహల్గాం దాడి బాధితులకు అండగా నిలవాలని కోరారు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రెండు జట్లకు భారీగా నెట్ రన్ రేట్ ఉండడంతో ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు దాదాపుగా సూపర్-4 బెర్త్ ను కన్ఫర్మ్ చేసుకుంటుంది. ప్లేయింగ్ 11 విషయానికి వస్తే రెండు జట్లు ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగాయి. తొలి నాలుగు ఓవర్లు ముగిసేసరికి పాకిస్థాన్ 2 వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్య తొలి ఓవర్లో సైమ్ అయూబ్ ని ఔట్ చేయగా.. రెండో ఓవర్లో బుమ్రా మహమ్మద్ హారీస్ ను పెవిలియన్ కు పంపాడు. ప్రస్తుతం క్రీజ్ లో ఫకర్ జమాన్ (10), ఫర్హాన్ (9) ఉన్నారు.