ఇండియాలో మోటో ఎడ్జ్ 70 స్మార్ట్ ఫోన్ లాంచ్.. వైర్ లెస్ ఛార్జింగ్.. రేటు కూడా మరీ ఎక్కువేం లేదు !

ఇండియాలో మోటో ఎడ్జ్ 70 స్మార్ట్ ఫోన్ లాంచ్.. వైర్ లెస్ ఛార్జింగ్.. రేటు కూడా మరీ ఎక్కువేం లేదు !

ఇండియాలో మోటో ఎడ్జ్ 70 స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. ఆఫ్లైన్ ఔట్ లెట్స్తో పాటు మోటరోలా వెబ్సైట్, ఫ్లిప్కార్ట్లో కూడా త్వరలో ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రానుంది. ఫాస్ట్ అండ్ వైర్ లెస్ ఛార్జింగ్ ఈ మొబైల్ హైలైట్ ఫీచర్. ఈ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్ కార్ట్లో ఈ మొబైల్ ధర 29 వేల 999 రూపాయలు చూపిస్తుంది. 8 జీబీ ర్యామ్, 256 ROM, 50MP+ 50MP ప్రైమరీ కెమెరా, 50MP ఫ్రంట్ కెమెరా.. 120 Hz రిఫ్రెష్ రేట్తో కూడిన అల్ట్రా స్లిమ్ 6.7 అమోల్డ్ డిస్ ప్లే, స్నాప్ డ్రాగన్ 7 జెన్ 4 చిప్ ప్రాసెసర్తో మోటో ఎడ్జ్ 70 బెటర్ ఫెర్మామెన్స్ ఇస్తుంది. బ్యాటరీ సామర్థ్యం 5000 mAh.

4k UHD, FHDలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. FHDలో స్లో మోషన్ వీడియో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. 5.99mm అల్ట్రా స్లిమ్గా 159g లైట్ వెయిట్ స్మార్ట్ ఫోన్ ఇది. బ్యాటరీ లైఫ్ దాదాపు 40 గంటలు. 31 గంటలు నిరంతరంగా వీడియోలు చూడొచ్చు. 61 గంటలకు పైగా కంటిన్యూగా మ్యూజిక్ వినొచ్చు. 68W టర్బోపవర్ ఛార్జింగ్, 15W వైర్ లెస్ ఛార్జింగ్ ఈ స్మార్ట్ ఫోన్ స్పెషాలిటీ. 

Bronze Green, Gadget Grey, Lily Pad రంగుల్లో ఈ స్మార్ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. పెద్ద హడావుడిగా ఉండే రంగుల్లో కాకుండా క్లీన్ అండ్ ప్రొఫెషనల్ లుక్లో మోటో ఎడ్జ్ 70 స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలోనే ఫ్లిప్కార్ట్లో ఈ స్మార్ట్ ఫోన్ అమ్మకాలు మొదలుకానున్నాయి. 30 వేల బడ్జెట్లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ కోసం చూస్తుంటే ఈ మోటో ఎడ్జ్ 70 తీసుకోవచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు.