ముగిసిన GHMC చివరి కౌన్సిల్ సమావేశం.. 2026-27 బడ్జెట్కు ఆమోదం

ముగిసిన GHMC చివరి కౌన్సిల్ సమావేశం.. 2026-27 బడ్జెట్కు ఆమోదం

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ప్రస్తుత పాలక వర్గం ముగియనుండటంతో.. చివరి కౌన్సిల్ సమావేశాన్ని శనివారం (జనవరి 31) నిర్వహించారు. త్వరలో ఎన్నికలు రానున్న క్రమంలో చివరిగా డబ్జెట్ పై చర్చ జరిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరిగింది. 

కేసీఆర్ హయాంలో GHMC అప్పుల పాలైందని కాంగ్రెస్ కార్పోపోరేటర్లు ఆరోపించడంతో మాటల యుద్ధం మొదలైంది.  కాంగ్రెస్ సభ్యుల ఆరోపణలపై బీఆర్ఎస్ కార్పోరేటర్లు అభ్యంతరం తెలిపారు. దీంతో కాసేపు గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఆ తర్వాత మేయర్ నచ్చజెప్పడంతో ఇరు పార్టీల కార్పోరేటర్లు శాంతించారు. ఈ సమావేశంలో 2026-27 బడ్జెట్ ను ఆమోదించారు. రూ.11,460  కోట్ల బడ్జెట్ కు కౌన్సిల్  ఆమోదం తెలిపింది. ఇది తనకు చివరి కౌన్సిల్ సమావేశం అంటూ మేయర్ గద్వాల విజయలక్ష్మీ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. 

►ALSO READ | గెలిచే అభ్యర్థులకు మాత్రమే B ఫామ్ ఇవ్వండి: అమెరికా నుంచి సీఎం రేవంత్ దిశానిర్దేశం

ఐదేళ్ల పదవి కాలంతో హైదరాబాద్ నగర అభివృద్ధికి తనవంతు కృషి చేశాననన్నారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి.  ఉద్యోగులు ,సిబ్బంది,అధికారులు కలిసి కట్టుగా పనిచేశారని చెప్పారు.  ఐదేళ్లు కాలం  నగర ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు,రివార్డులు వచ్చాయన్నారు. మేయర్ పదవి కాలం ముగిసినా తన బాధ్యత మరువనని భావోధ్వేగానిక గురయ్యారు . ఫిబ్రవరి  10 తో   జీహెచ్ఎంసి పాలక మండలి పదవి కాలం ముగియనుంది.