ఫిబ్రవరి 2026 బ్యాంక్ హాలిడేస్ లిస్ట్ ఇదిగో: ఏ ఏ రోజుల్లో బ్యాంకులు బంద్ అంటే ?

 ఫిబ్రవరి 2026 బ్యాంక్ హాలిడేస్ లిస్ట్ ఇదిగో: ఏ ఏ రోజుల్లో బ్యాంకులు బంద్ అంటే ?

కొత్త ఏడాది జనవరి నెల ముగిసి ఫిబ్రవరి నెల రాబోతుంది. అయితే ఫిబ్రవరిలో బ్యాంకులకు భారీగా సెలవులు రాబోతున్నాయి. మీకు  ఏదైనా బ్యాంక్ పని ఉంటే ముందే ప్లాన్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఒక ఏడాదిలో అతి తక్కువ రోజులు ఉన్న నెల ఫిబ్రవరి. ఈ బ్యాంకు సెలవులు రాష్ట్రాల వారీగా మారుతుంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రతి నెల రాష్ట్రాల బ్యాంకు హాలిడేస్ లిస్ట్ విడుదల చేస్తుంది.

దీని ప్రకారం ఫిబ్రవరి 2026లో కొన్ని ప్రత్యేక సందర్భాలలో బ్యాంకులు మూసిపడడతాయి. వీటిలో లోసర్, ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి, రాష్ట్ర అవతరణ దినోత్సవం ఉన్నాయి. RBI నిబంధనల ప్రకారం, ప్రతి నెల రెండవ, నాల్గవ శనివారాలు సహా ప్రతి ఆదివారం బ్యాంకులు మూసి ఉంటాయి.

ALSO READ : నిర్మలమ్మ నిర్ణయంతో వెండి రేట్లకు తిరిగి రెక్కలు వస్తాయా..? జరగబోయేది ఇదే..

హాలిడేస్ లిస్ట్ :
ఫిబ్రవరి 15: ఈ రోజు మహాశివరాత్రి, అలాగే  ఆదివారం కూడా. అందువల్ల, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు,   ఆంధ్రప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.

ఫిబ్రవరి 18: లోసర్ పండుగ కారణంగా  సిక్కింలో బ్యాంకులు మూసివేయబడతాయి. టిబెటన్ నూతన సంవత్సరం అని కూడా పిలువబడే ఈ లోసర్ పండగని  సిక్కింలో ఎంతో ఉత్సాహంగా, వైభవంగా జరుపుకునే ప్రత్యేక పండుగ. 

ALSO READ : బడ్జెట్ ముందే బాదుడు? సిగరెట్ నుండి గ్యాస్ వరకు.. ఫిబ్రవరి 1 నుండి మారనున్న రూల్స్ ఇవే..!

ఫిబ్రవరి 19: ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని మహారాష్ట్రలో బ్యాంకులు బంద్. 

ఫిబ్రవరి 20: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా  మిజోరం, అరుణాచల్ ప్రదేశ్‌లలో బ్యాంకులు పనిచేయవు. 

డిజిటల్ బ్యాంకింగ్ 
మీరు బ్యాంకు సెలవు రోజుల్లో  ఇంటర్నెట్ బ్యాంకింగ్, SMS బ్యాంకింగ్,  WhatsApp బ్యాంకింగ్ వంటి సేవలను ఎప్పటిలాగే వాడుకోవచ్చు. గూగుల్ పే, ఫోన్ పే వంటి సేవలు యధావిధిగా పనిచేస్తాయి. క్యాష్ విత్‌డ్రా చేసుకోవడానికి  ఏటిఎం సేవలు కూడా అందుబాటులో ఉంటాయి.

ఫిబ్రవరి 1 ఆదివారం, ఫిబ్రవరి 8 రెండో శనివారం,  ఫిబ్రవరి 14 రెండో శనివారం, ఫిబ్రవరి 15 ఆదివారం, ఫిబ్రవరి 28 నాలుగో శనివారం కాబట్టి ఈ రోజుల్లో బ్యాంకులు పనిచేయవు.