Pradeep Ranganathan: ప్రేమకు ఇన్సూరెన్స్ చేస్తే ఎలా ఉంటుంది? క్రేజీ ఫాంటసీ లవ్ స్టోరీ వస్తున్న ప్రదీప్ రంగనాథన్!

Pradeep Ranganathan: ప్రేమకు ఇన్సూరెన్స్ చేస్తే ఎలా ఉంటుంది?  క్రేజీ ఫాంటసీ లవ్ స్టోరీ వస్తున్న ప్రదీప్ రంగనాథన్!

ప్రస్తుతం సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో యూత్ ఐకాన్ గా దూసుకుపోతున్న నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్. 'లవ్ టుడే' వంటి సంచలన విజయం తర్వాత.. ఆయన నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. గత ఏడాది విడుదలైన 'డ్యూడ్' సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకుల మనసు గెలుచుకుని సక్సెస్ ను అందుకున్నారు. ఇప్పుడు ప్రదీప్ మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.. అదే 'ఎల్‌ ఐ కే' (Love Insurance Kompany - LIK).

కాంబినేషన్ అదిరింది!

ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరగడానికి ప్రధాన కారణం దీని క్రేజీ కాంబినేషన్. క్రియేటివ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో..  ప్రదీప్ రంగనాథన్ సరసన'ఉప్పెన' బ్యూటీ  కృతి శెట్టి నటిస్తోంది. వీరిద్దరి కెమిస్ట్రీ వెండితెరపై ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమాలో మరో హైలైట్ ఏమిటంటే, వెర్సటైల్ నటుడు ఎస్‌జే సూర్య, సీమాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్‌జే సూర్య మార్క్ యాక్టింగ్ ఈ ఫాంటసీ లవ్ స్టోరీకి అదనపు బలాన్ని ఇవ్వనుంది.

ఫాంటసీ కథాంశంతో..

'LIK' చిత్రం ఒక వినూత్నమైన ఫాంటసీ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. ప్రేమకు ఇన్సూరెన్స్ చేస్తే ఎలా ఉంటుంది? అనే విభిన్నమైన పాయింట్‌తో విఘ్నేష్ శివన్ ఈ కథను అల్లినట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ ప్రధానంగా మలేషియా, సింగపూర్ వంటి అందమైన ప్రదేశాల్లో జరిగింది. విదేశీ లొకేషన్లలో చిత్రీకరించిన పాటలు, విజువల్స్ ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాయి. దీనికి తోడు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం ఇప్పటికే సోషల్ మీడియాలో బజ్‌ క్రియేట్ చేస్తోంది.

రిలీజ్ ఎప్పుడంటే?

నిజానికి ఈ సినిమా గత ఏడాది దీపావళికి విడుదల కావాల్సింది. కానీ అదే సమయంలో ప్రదీప్ నటించిన 'డ్యూడ్' విడుదల కావడం వల్ల, థియేటర్ల క్లాష్‌ను నివారించడానికి 'LIK'ని వాయిదా వేశారు. లేటెస్ట్ సమాచారం ప్రకారం, ఈ చిత్రాన్ని ప్రేమికుల రోజు (Valentine’s Day) కానుకగా ఫిబ్రవరి 12న విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రేమకథ కావడంతో ఫిబ్రవరి నెల ఈ సినిమాకు సరైన సమయమని చిత్ర యూనిట్ భావిస్తోంది.

►ALSO READ | Chiranjeevi: ఓటీటీలోకి ‘మన శంకర వరప్రసాద్ గారు’.. డిజిటల్ దునియాలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

సక్సెస్ ట్రాక్ కొనసాగేనా?

ప్రదీప్ రంగనాథన్ గత చిత్రాలన్నీ యువతను అమితంగా ఆకట్టుకున్నాయి. సెవెన్ స్క్రీన్ స్టూడియో, రౌడీ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంపై భారీ పెట్టుబడి పెట్టారు. వరుస విజయాలతో జోరు మీదున్న ప్రదీప్, ఈ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'తో హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటారో లేదో చూడాలి. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక టీజర్ , విడుదల తేదీపై స్పష్టత రానుంది.