పాత లెక్కలు తేలుస్తున్నరు..

పాత లెక్కలు తేలుస్తున్నరు..
  •     మూడు, నాలుగేళ్ల కిందటి ఆఫీసర్ల అవినీతిని బయటికి తీస్తున్న ఏసీబీ ఆఫీసర్లు
  • మొన్న పే అండ్ అకౌంట్స్ లో సూపరింటెండెంట్, నిన్న ఎక్సైజ్ సీఐ అరెస్ట్ 
  • ఏసీబీ కేసుల్లో కొంత పంథా.. 

కరీంనగర్, వెలుగు: ఏసీబీ అవినీతి ఆఫీసర్ల పాత లెక్కలు తేలుస్తున్నారు. ఎప్పుడో మూడు, నాలుగేళ్ల కింద తీసుకున్న  లంచం గుట్టు విప్పుతున్నారు. బ్యాంకు అకౌంట్లు, యూపీఐ లావాదేవీల ఆధారంగా కేసులు నమోదు చేసి కటకటాల్లోకి పంపిస్తున్నారు. వారి బినామీలనూ గుర్తించి అరెస్టు చేస్తున్నారు. మూడు రోజుల్లో ఇద్దరు ఆఫీసర్లతోపాటు ఒక బినామీని జైలుకు పంపారు. దీంతో గతంలో ఎప్పుడో బినామీ అకౌంట్ నంబర్లు ఇచ్చి లంచం పైసలు వేయించుకున్న అవినీతి ఆఫీసర్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అంతా సవ్యంగా జరిగిపోయిందనుకుంటుండగా తమ పాత చిట్టాలు విప్పితే పరిస్థితి ఏమిటని ఆందోళనకు గురవుతున్నారు. 

బాధితులు ఎప్పుడు చెప్పినా.. కేసులు తప్పట్లే

ఇప్పటివరకు ఏసీబీ దాడులు అంటే అవినీతి ఆఫీసర్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం, లేదంటే వారు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని రైడ్ చేసి ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకోవడం అందరికి తెలిసిందే. కానీ ఇప్పుడు అవినీతి ఆఫీసర్ల బినామీ అకౌంట్లను, పాత లావాదేవీలను ఏసీబీ ఆఫీసర్లు జల్లెడ పడుతున్నారు.

‘నేను రెండేళ్ల కింద ఓ ఆఫీసర్ డిమాండ్ మేరకు లంచంగా ఫలానా నంబర్ కు డబ్బులు పంపాను.’ అని బాధితుడు చిన్న క్లూ ఇచ్చినా ఆ అకౌంట్ నంబర్ ద్వారా జరిగిన లావాదేవీలను ఏసీబీ ఆఫీసర్లు తెలుసుకొని వాస్తవమని తేలితే అరెస్టు చేస్తున్నారు. తమ పేరుతో కాకుండా బినామీల పేరిట లావాదేవీలు జరిపినా వదలడం లేదు. బినామీ అకౌంట్ నుంచి తిరిగి అవినీతి ఆఫీసర్ అకౌంట్ కో, వారి బంధువు అకౌంట్ కో డబ్బులు ట్రాన్స్ ఫర్ అవుతున్న విషయాన్ని గుర్తిస్తున్నారు. 

మూడు రోజుల్లో ముగ్గురి అరెస్టు.. 

    కరీంనగర్ ఎల్ఎండీ కాలనీలోని వర్క్స్ అకౌంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జేడీ ఆఫీసు సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న ఈగల మధుసూదన్ ఆఫీసులో పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్న ఫైళ్ల పరిష్కారానికి, మూవ్ చేసేందుకు ఉద్యోగులు, కాంట్రాక్టర్ల నుంచి లంచాలు వసూలు చేసేవాడు. ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా వేరొక బినామీ పేరుతో బ్యాంకులో అకౌంట్ ఓపెన్​చేసి, 2022 సెప్టెంబర్ నుంచి 2023 సెప్టెంబర్ మధ్య రూ.14,77,033ను కాంట్రాక్టర్లు, కొందరు ఉద్యోగుల నుంచి లంచాల రూపంలో తీసుకున్నాడు.

సుమారు రెండున్నరేళ్ల తర్వాత ఈ వ్యవహారం ఏసీబీ ఆఫీసర్లకు తెలియడంతో లావాదేవీలను గుర్తించి.. ఈ నెల 16న మధుసూదన్ ను అరెస్టు చేశారు.   కరీంనగర్ ఎక్సైజ్ సీఐ గుండేటి రాము గతంలో వేములవాడ సీఐగా పనిచేసినప్పుడు తనకు బెల్లం, మద్యం వ్యాపారుల నుంచి వచ్చే లంచాలను ఫ్రెండ్ జక్కని వేణు అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వేయించేవాడు. ఆ తర్వాత రాము కరీంనగర్ కు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యాడు. కానీ వేములవాడలో ఆయనవల్ల వేధింపులకు గురైన వ్యాపారులు వారు డబ్బులు పంపిన వివరాలను ఏసీబీ ఆఫీసర్లకు అందిస్తే, బినామీతోపాటు ఎక్సైజ్ సీఐని జైలుకు పంపారు.