ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. కొత్త సిరి వచ్చేస్తోంది.. గూగుల్‌‌ జెమినితో యాపిల్‌‌ సిరి

ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. కొత్త సిరి వచ్చేస్తోంది.. గూగుల్‌‌ జెమినితో యాపిల్‌‌ సిరి
  • ఫిబ్రవరిలో ఐఓఎస్‌‌‌‌ 26.4తో అందుబాటులోకి..

యాపిల్‌‌ తన ఫోన్లలో గూగుల్‌‌ ఏఐ జెమినిని వాడనుంది. ఐఓఎస్‌‌ 26.4 బీటాలో గూగుల్‌‌ జెమిని ఆధారంగా పనిచేసే యాపిల్‌‌ ఇంటెలిజెన్స్‌‌  ఫీచర్లను  వచ్చే నెల లాంచ్ చేయనుంది. కొత్త సిరిని యూజర్ల ముందుకు తీసుకురానుంది.

న్యూఢిల్లీ: టెక్ కంపెనీ యాపిల్‌‌‌‌ తన  ఫోన్ల కోసం గూగుల్‌‌‌‌ ఏఐ జెమినిని వాడనుంది. ఐఓఎస్‌‌‌‌ 26.4 బీటాలో గూగుల్‌‌‌‌ జెమిని ఆధారంగా పనిచేసే ఇంటెలిజెన్స్‌‌‌‌  ఫీచర్లను  వచ్చే నెల లాంచ్ చేయనుంది. కొత్త సిరిని యూజర్లను ముందుకు తీసుకురానుంది. 

ఐఓఎస్‌‌‌‌ 26.4 తో  అందుబాటులోకి వచ్చే ఈ అప్‌డేటెడ్‌ సిరి, ఫోన్‌‌‌‌ స్క్రీన్‌‌‌‌పై జరుగుతున్నది అర్థం చేసుకోవడం, యాప్‌‌‌‌లలో చర్యలు తీసుకోవడం వంటివి చేయగలదు. ఇవన్నీ జెమిని మోడళ్ల ఆధారంగా యాపిల్‌‌‌‌ ఫౌండేషన్‌‌‌‌  వీ10 ద్వారా జరుగుతాయి. ఐఓఎస్‌‌‌‌ 27లో  సిరి మరింత శక్తివంతమై చాట్‌‌‌‌బాట్‌‌‌‌గా మారుతుంది. ఈ ఏడాది చివరిలో ఇది అందుబాటులోకి రానుంది.

ఏఐ మోడళ్ల కోసం యాపిల్‌‌‌‌ ఆంత్రోపిక్‌‌‌‌, ఓపెన్‌‌‌‌ ఏఐతో చర్చలు జరిపినా, ఖర్చు,  వ్యూహాత్మక కారణాల వల్ల గూగుల్‌‌‌‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఐ ఫోన్లలో గూగుల్‌‌‌‌ సెర్చ్‌‌‌‌ను డీఫాల్ట్‌‌‌‌గా మార్చడం చట్టవిరుద్దం కాదని కోర్టు తీర్పు ఇవ్వడంతో ఈ ఇరు కంపెనీల మధ్య  భాగస్వామ్యం సాధ్యమైందని బ్లూమ్‌‌‌‌బర్గ్ పేర్కొంది. కాగా,  యాపిల్ తన సొంత ఏఐ మోడళ్లను డెవలప్ చేయడానికి ప్రయత్నించింది. కానీ, రిజల్ట్స్ ఆశాజనకంగా  లేకపోవడంతో సిరి కోసం గూగుల్ జెమినితో భాగస్వామ్యం అయ్యింది.