ఇది ప్రజా పాలన కాదు.. రాక్షస పాలన : కేటీఆర్

ఇది ప్రజా పాలన కాదు.. రాక్షస పాలన : కేటీఆర్
  • కాంగ్రెస్ న్యాయ సూత్రాలు నేతి బీరకాయ చందమే: కేటీఆర్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన ప్రజా పాలన సాగడం లేదని, ఇది కేవలం రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న రాక్షస పాలన అని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ వర్కింగ్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ కేటీఆర్ విమర్శించారు. రాహుల్ గాంధీ తుక్కుగూడలో విడుదల చేసిన న్యాయ పత్రంలో పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా మాట్లా డారని, కానీ ఆ వేదికపైనే బీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన వారు ఆయన పక్కనే కూర్చున్నారని గుర్తుచేశారు. 

సోమవారం తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన రిపబ్లిక్‌‌‌‌‌‌‌‌ డే వేడుకల్లో కేటీఆర్​ పాల్గొన్నారు.   అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి.. జెండా గద్దెలను కూల్చేయండి అని బహిరంగ సభల్లో పిలుపునివ్వడం శాంతి భద్రతలను, రాజ్యాంగ విలువలను సమాధి చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రాష్ట్రంలో దళితులు, గిరిజనులు, జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నా సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం లేదని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన జర్నలిస్టులను టెర్రరిస్టుల మాదిరిగా అరెస్ట్ చేస్తున్నారని, ఇది రాజ్యాంగ విలువల హననం కాదా అని ప్రశ్నించారు. హైడ్రా, మూసీ పేరిట పేదల ఇండ్లను బుల్డోజర్లతో కూల్చడం రేవంత్ రెడ్డి రాక్షస పాలనకు నిదర్శనమన్నారు.

హెచ్‌‌‌‌‌‌‌‌సీయూ విద్యార్థుల లఘు నాటిక బాగుంది..

రాష్ట్రంలో రాజ్యాంగాన్ని ఏ విధంగా తుంగలో తొక్కుతున్నారో హెచ్‌‌‌‌‌‌‌‌సీయూ విద్యార్థులు కండ్లకు కట్టేలా తమ లఘు నాటిక ద్వారా వివరించారని కేటీఆర్ అన్నారు. వర్సిటీకి చెంది న 400 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి కాపాడుకోవడానికి వారు చేస్తున్న కృషి దేశాన్నే కదిలించిందని కొనియాడారు. సింగరేణి నైనీ బ్లాక్ వ్యవహారంపై మంగళవారం కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ నేతల బృందం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు.