- ఆస్తి పన్ను రూపంలో ఇవ్వనున్న సర్కారు
హైదరాబాద్ సిటీ, వెలుగు : జీహెచ్ఎంసీ అప్పులను రాష్ట్ర ప్రభుత్వం మరో పద్ధతిలో చెల్లించబోతున్నది. అప్పులు తీర్చుకునేందుకు స్టేట్ బడ్జెట్ లో జీహెచ్ఎంసీకి రూ.10 వేల కోట్లను ఇవ్వాలన్న ప్రపోజల్‌తో పాటు మరో ఆరు ప్రతిపాదనలను అధికారులు సర్కారుకు గతంలోనే సమర్పించారు. ఇందులో ప్రభుత్వ భవనాలకి సంబంధించి జీహెచ్ఎంసీకి చెల్లించాల్సిన ఆస్తి పన్ను బకాయిలను నెల వారీగా చెల్లించడం ద్వారా అప్పులు తీర్చడానికి సర్కారు సిద్ధమైంది.
ప్రస్తుతం జీహెచ్ఎంసీకి రూ. 4,786 కోట్ల అప్పులున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీకి రూ.5,500 కోట్ల వరకు ప్రాపర్టీ ట్యాక్స్ బకాయి ఉంది. దీన్ని ప్రతి నెలా రూ.100 కోట్ల చొప్పున వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి చెల్లించేందుకు నెలసరి షెడ్యూల్ ను ఫిక్స్ చేసుకోనున్నట్లు సమాచారం.
