షాకింగ్: గ్రాము రూ.16వేలు దాటేసిన 24 క్యారెట్ల గోల్డ్.. కేజీ వెండి రేటు చూస్తే మతిపోతోందిగా..

షాకింగ్: గ్రాము రూ.16వేలు దాటేసిన 24 క్యారెట్ల గోల్డ్.. కేజీ వెండి రేటు చూస్తే మతిపోతోందిగా..

జనవరి 2026లో భారతీయులు కలలో కూడా ఊహించని స్థాయిలకు బంగారం, వెండి రేట్లు పెరిగిపోయాయి. గ్రాము బంగారం ఏకంగా రూ.16వేలను క్రాస్ చేసి ఆల్ టైం రికార్డు గరిష్ఠాలకు చేరుకుంది. ఇక వెండి విషయానికి వస్తే ప్రతి రోజూ దాదాపుగా పెరుగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో గోల్డ్ అండ్ సిల్వర్ కేవలం ధనికులకు మాత్రమే అందుబాటులో ఉండే వస్తువులుగా మారనున్నాయి. అందుకే ప్రస్తుతం రేట్లు అధికంగా ఉన్నప్పటికీ భారతీయులు అప్పు చేసైనా కాసు బంగారం కొనాలని అనుకుంటూ షాపుల ముందు క్యూ కడుతున్నారు. 

జనవరి 26న బంగారం రేట్లు భారీగా పెరుగుదలను నమోదు చేశాయి. దీంతో జనవరి 25 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.245 పెరిగింది దేశంలో. అయితే హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు నిన్నటి కంటే కొద్దిగా తగ్గి రూ.16వేల 271గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 915గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది. 

ఇక సామాన్యుల బంగారంగా ఉన్న వెండి రోజురోజుకూ పెరుగుతూ అసలు తగ్గదేమో అనిపించేలా మారింది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగటంతో సిల్వర్ ర్యాలీకి అడ్డుకట్ట లేకుండా కొనసాగుతోందని నిపుణులు అంటున్నారు. సోమవారం జనవరి 26, 2025న వెండి రేటు కేజీకి రూ.5వేలు పెరిగింది దేశీయంగా. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.3లక్షల 75వేలుగా ఉంది. అంటే గ్రాము ధర రూ.375 వద్ద ఉంది.