IND vs NZ: 15 మందిలో 14 మంది ఆడేశారు: శ్రేయాస్ అయ్యర్‌కు తప్ప అందరికీ ఛాన్స్.. కారణం ఇదే!

IND vs NZ: 15 మందిలో 14 మంది ఆడేశారు: శ్రేయాస్ అయ్యర్‌కు తప్ప అందరికీ ఛాన్స్.. కారణం ఇదే!

టీమిండియా ప్రస్తుతం న్యూజిలాండ్ తో 5 మ్యాటిక్ ల టీ20 సిరీస్ ఆడుతుంది. ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్ ల్లోనూ గెలిచిన భారత  జట్టు 2-0 ఆధిక్యంలో నిలిచింది. ప్రస్తుతం ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. ఆదివారం (జనవరి 25)  గౌహతి వేదికగా  బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో ఇండియా రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. రెండో టీ20కి దూరమైన బుమ్రా మూడో టీ20కి జట్టులో వచ్చాడు. మరోవైపు స్పిన్నర్ రవి బిష్ణోయ్ కూడా ప్లేయింగ్ 11 లో చోటు దక్కింది. 

ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి ఈ మ్యాచ్ లో రెస్ట్ ఇచ్చారు. ఇప్పటివరకు జరిగిన మూడు టీ20 మ్యాచ్ ల్లో స్క్వాడ్ లో 15 మంది ఉంటే 14 మందికి ప్లేయింగ్ 11లో ఆడే అవకాశం లభించింది. అయ్యర్ మినహాయిస్తే ప్రతి ఒకరికి ప్లేయింగ్ 11లో చోటు దక్కింది. అయితే దీనికి కారణం లేకపోలేదు. ఫిబ్రవరి 7 నుంచి వరల్డ్ కప్ జరగనుంది. భారత టీ20 జట్టులో ఉన్న తిలక్ వర్మకు విజయ్ హజారే ట్రోఫీలో గాయం కావడంతో ఆ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ ను సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే శ్రేయాస్ కేవలం న్యూజిలాండ్ తో జరగబోయే తొలి మూడు టీ20 సిరీస్ కు మాత్రమే ఎంపికయ్యాడు. వరల్డ్ కప్ ఆడే అవకాశాలు లేవు. 

వరల్డ్ కప్ సమయానికి తిలక్ వర్మ పూర్తి ఫిట్ నెస్ సాధించే అవకాశాలున్నాయి. ఒకవేళ తిలక్ కోలుకుంటే తిరిగి భారత జట్టులోకి వస్తాడు. తిలక్ టీమిండియాలో చేరితే శ్రేయాస్ అయ్యర్ పై మరోసారి వేటు పడడం గ్యారంటీ. వరల్డ్ కప్ స్క్వాడ్ లో లేకపోవడంతో శ్రేయాస్ అయ్యర్ కు న్యూజిలాండ్ తో జరగబోయే టీ20 సిరీస్ లో స్థానం దక్కే ఛాన్స్ లేదు. ఎందుకంటే శ్రేయాస్ కేవలం న్యూజిలాండ్ టీ20 సిరీస్ కు మాత్రమే ఎంపికయ్యాడు. ఈ కారణంగా గాయపడిన తిలక్ వర్మ స్థానంలో జట్టులో వచ్చిన అయ్యర్ కు ప్లేయింగ్ 11లో చోటు దక్కే అవకాశాలు లేవు. 

మరోవైపు బిష్ణోయ్ వరల్డ్ కప్ స్క్వాడ్ లో లేకపోయినా ప్లేయింగ్ 11 లో ఛాన్స్ దక్కింది. అయితే వాషింగ్టన్ సుందర్ స్థానంలో జట్టులోకి వచ్చిన బిష్ణోయ్ వరల్డ్ కప్ ఆడే అవకాశం ఉంది. ఎందుకంటే సుందర్ వరల్డ్ కప్ కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ కారణంగి బిష్ణోయ్ కి ప్రాక్టీస్ అవుతుందని జట్టు మూడో టీ20లో అవకాశమిచ్చింది.