హైదరాబాద్ లో దారుణం... డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్న ఎస్ఐని ఢీకొట్టి.. దూసుకెళ్లిన కారు...

హైదరాబాద్ లో దారుణం... డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్న ఎస్ఐని ఢీకొట్టి.. దూసుకెళ్లిన కారు...

హైదరాబాద్ యాచారంలో దారుణం జరిగింది.. ఆదివారం ( జనవరి 25 ) డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తుండగా.. ఓ ఎస్ఐని ఢీకొట్టి దూసుకెళ్లింది కారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా.. వందకు పైగా స్పీడ్ తో వచ్చిన ఓ కారు ఎస్ఐ మధును ఢీకొట్టి దూసుకెళ్లింది. ఎస్ఐ మధు బానెట్ పై ఉండగా వేగంగా దూసుకెళ్లడంతో అక్కడున్నవారంతా భయాందోళనకు గురయ్యారు. 

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో భాగంగా కారును ఆపడానికి ప్రయత్నిస్తున్న ఎస్ఐని ఢీకొట్టడమే కాకుండా అతను బానెట్ పై ఉండగానే కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది కారు. ఈ ఘటనలో ఎస్ఐకి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ఎస్ఐని మాల్ ప్రాంతంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మధు బానెట్ పై ఉండగానే కారు వేగంగా దూసుకెళ్లడంతో అంతా టెన్షన్ పడ్డారు. ఘటన జరిగిన కొద్ది దూరంలో మధు కనిపించడంతో ఊపిరి పీల్చుకున్నారు. సీటీవీ ఫుటేజీ ఆధారంగా కారు కోసం గాలించిన పోలీసులు ఇబ్రహీంపట్నంలో నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.