Good Health: జామకాయ తింటే ఎంతో ఆరోగ్యం.. కాని ఎప్పుడు తినాలి.. ఎప్పుడు తినకూడదు..

Good Health: జామకాయ తింటే ఎంతో ఆరోగ్యం.. కాని ఎప్పుడు తినాలి.. ఎప్పుడు తినకూడదు..

  ఏడాదంతా లభించే తక్కువ ధరకు .. ఎక్కువ పోషకాలతో మార్కెట్లో లభించే పండ్లలో జామకాయ ఒకటి.  చాలామంది ఇళ్లలో గోడ పక్కన బయట ఈ చెట్టును పెంచుకుంటారు.  అంటే జామకాయలంటే పిల్లలకు.. పెద్దలకు ఎంత ఇష్టమో మరే వేరే చెప్పనక్కరలేదు. వీటిని డైరక్ట్​గా తింటారు. కొంతమంది సలాడ్స్​, స్నాక్స్​ రూపంలో.. మరికొంత మంది జ్యూస్​ చేసుకుంటారు.. ఇలా  ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వారు  జామపండును ఆరగిస్తారు.  కాని దీనిని ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదని .. నిత్యం కొన్ని సమయాల్లోనే తినాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.  మరి జామ పండును ఎప్పుడు తినాలి.. ఏ సమయంలో తినాలి.. మొదలగు విషయాలను ఈస్టోరీలో తెలుసుకుందాం. . .! 

జామకాయలు టేస్టే వేరు.. అంతే కాదు.. అనేక రోగాలకు మంచి మందు కూడా.. దీనిలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.  జామ‌పండును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న మొత్తం శ‌రీర ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. జామ‌కాయ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి క‌లిగే మేలు గురించి అలాగే దీనిని తీసుకునే స‌రైన స‌మ‌యం గురించి పోషకాహార వైద్యులు వివ‌రిస్తున్నారు. దీనిని ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదని నిపుణులు చెబుతున్నారు.  

ఎప్పుడు తినాలి..

జామకాయ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటలలోపు తినాలి.  ఉదయం బ్రేక్​ ఫాస్ట్​ చేసిన తరువా 30 నిమిషాల తరువాత గంటలోపుగా  ఒక మోస్తరు ( చిన్నసైజు) జామకాయను తింటే ఎలాంటి ఇబ్బంది లేకుండా తిన్న పదార్దం జీర్ణక్రియ జరుగుతుందని చెబుతున్నారు. కాని  రాత్రి సమయంలో  జామపండును అసలు తినకూడదు

ఇంకా మధ్యాహ్నం భోజనం చేసిన 2 గంటల తరువాత  జామకాయ తింటే  ఆరోగ్యానికి మంచిది. ఎక్కడైనా ఫంక్షన్లకు వెళ్లినప్పుడు మాత్రం అన్నం తిన్న తరువాత తప్పకుండా జామపండును తినాలి.  ఇలా తినడం వలన జీర్ణక్రియలో ఎలాంటి సమస్యలు రావు. 

పొద్దున్నే పరగడుపున .. ఖాళీ కడుపుతో మాత్రం అస్సలు జామపండు తినకూడదు.   ఇలా తింటే జామపండు  ఆరోగ్యానికి మేలు చేస్తాయి.  వాటితో ఉండే పోషకాలు శరీరానికి అంది.. చాలా ఎక్కువుగా ఆరోగ్య ప్రయోజనాలు పొందుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. 

రుచితో పాటు ఆరోగ్యం

జామ‌కాయ‌లు రుచితో పాటు ఆరోగ్యానికి మేలు కలుగజేస్తాయి. వీటిలో  విట‌మిన్ సి తో పాటు అనేక సూక్ష్మ పోష‌కాలు కూడా ఉంటాయి. దీనిని దేశీ సూప‌ర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. 100 గ్రాముల జామ‌కాయ‌ల్లో  68 కిలో కేల‌రీలు, 2.5 గ్రా. ప్రోటీన్, 14 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 5.4 గ్రాముల ఫైబ‌ర్ కంటెంట్​  ఉంటుంది. అలాగే 100 గ్రాముల జామ‌పండులో దాదాపు 228 మి.గ్రా. విట‌మిన్ సి ఉంటుంది. జామ‌పండునుతినడం వలన  పేగు క‌ద‌లిక‌లు ఎక్కువ‌గా ఉంటాయి. త‌ద్వారా తిన్న ఆహారం సుల‌భంగా జీర్ణమ‌వ్వడంతో పాటు మ‌ల‌బ‌ద్దకం స‌మ‌స్య కూడా త‌గ్గుతుంది.

విట‌మిన్ సి..

 జామ‌పండు మ‌న శ‌రీరానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. వైద్య నిపుణలు తెలిసిన వివరాల ప్రకారం  రోజూ ఒక జామ‌పండును తింటే  శ‌రీరానికి కావ‌ల్సిన విట‌మిన్ సి  అందడంతో  చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డ‌డంతో పాటు చ‌ర్మం బిగుతుగా త‌యార‌వుతుంది. ఇంకా ఇందులో లభించే విటమిన్​ సి  కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. 

బ‌రువు అదుపులో..

జామపండులో పొటాషియం ఎక్కువ మోతాదులో ఉండటం వలన  బీపీ అదుపులో ఉంటుంది. 
శ‌రీర బ‌రువును అదుపులో ఉంచ‌డంలో కూడా జామ‌పండు మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. ఆక‌లి త్వరగా వేయ‌కుండా ఉంటుంది. దీంతో శ‌రీర బ‌రువు అదుపులో ఉంటుంది. 

జామ‌పండును తీసుకోవ‌డం వ‌ల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. జామ‌పండు త‌క్కువ గ్లైసెమిక్ స్థాయిల‌ను క‌లిగి ఉంటుంది. క‌నుక షుగ‌ర్ వ్యాధి గ్రస్తులు కూడా ఈ పండును తింటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. జామ‌పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. క‌నుక దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఇన్పెక్షన్లు త్వర‌గా మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.