మనం తీసుకునే అతిముఖ్యమైన మూడు పోషకాలలో ప్రోటీన్ ఒకటి. దైనందిన జీవితంలో ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్లు చాలాకీలకం. కండరాలు, ఎముకలు, కణాజాల అభివృద్ది, పునరుద్దరణ, రోగనిరోధకర శక్తికి ఇవి సహాయపడతాయి. వయసు, శరీర బరువుకు తగ్గట్టుగా ప్రోటీన్ అవసరం ఉంటుంది. గుడ్లు, చికెన్, చేపలు, పప్పుధాన్యాలు, పెరుగు, ఆకుకూరలు, బాదం వంటి వాటిలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అదే శాఖాహారులకైతే చిక్కుళ్ళు, పప్పుధాన్యాలు, కూరగాయలు కీలక సోర్స్. కూరగాయాలలో కొన్ని ప్రోటీన్లను అందిస్తున్నప్పటికీ దేనీ నుంచి ఎంత ప్రోటీన్ లభిస్తుంది, ప్రోటీన్ అవసరాలను ఏదీ ఎక్కువగా తీర్చడంలో సహాయపడుతుందో తెలుసుకుందాం..
ప్రతి మనిషికి వయసు, బరువును బట్టి ప్రోటీన్ తీసుకోవాల్సి ఉంటుందని డైటీషియన్లు చెబుతున్నారు. ప్రతి కిలోగ్రాము బరువుకు 0.8గ్రాముల ప్రోటీన్ అవసరం. ఇక చురుకైన వ్యక్తులకు 1గ్రాము వరకు, వ్యాయామం చేసేవారికి 1.2 గ్రాము నుంచి 1.3 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలంటున్నారు.
Also Read : 2 వారాలు చక్కెర మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా ?
ఎడామేమ్ , బఠానీలలో అత్యధిక ప్రోటీన్ ఉంటుందని డైటీషియన్లు చెబుతున్నారు. ఎడామేమ్ అనేక ఆరోగ్య ప్రయోజనాలున్న చిన్న సోయాబీన్.ఇందులో 18గ్రాముల వరకు ప్రోటీన్ ఉంటుంది. అదనంగా ఫైబర్,విటమిన్లు,ఐరన్,కాల్షియం,మెగ్నీషియం, వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
ఇక ఇతర కూరగాయలు పాలకూర, బ్రోకలీ, బఠానీలు, కాలే లో కూడా అధిక ప్రోటీన్ లు లభిస్తాయి. ఈ ప్రోటీన్లు శరీర నష్టం నుంచి రక్షించడమే కాకుండా, యాంటీ ఆక్సిడెంట్లు, జీర్ణక్రియకు సహాయపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే ఫైబర్లు ఉంటాయి.
కూరగాయలలో అత్యల్పంగా దోసకాయలో తక్కువ మొత్తం ప్రోటీన్ ఉంటుంది. ఒక కప్పు దోసకాయలో 1 గ్రాము ప్రోటీన్ మాత్రమే లభిస్తుంది. అయితే దోసకాయలో ఉంటే నీరు, విటమిన్లు, ఖనిజాలు ఆరోగ్యానికి ఎంతో సాయపడతాయని చెబుతున్నారు.
ఏ కూరగాయలో ఎంత ప్రోటీన్.. ?
ఎడమామే(చిన్న సోయాబీన్) -18 గ్రాములు
శెనగలు-15 గ్రాములు
నల్ల బీన్స్ -15 గ్రాములు
బఠానీలు -9 గ్రాములు
పాలకూర- 5నుంచి6 గ్రాములు
మొక్కజొన్న -5గ్రాములు
బ్రిస్సెల్స్ -4గ్రాములు
కాలిఫ్లవర్ - 3గ్రాములు
బెండకాయ -3గ్రాములు
బంగాళదుంప -3గ్రాములు
గ్రీన్ బీన్స్ -2గ్రాములు
