Chiranjeevi Gift: హిట్ మిషన్ అనిల్ రావిపూడికి మెగా గిఫ్ట్.. లగ్జరీ కారు ధర వైరల్..

Chiranjeevi Gift: హిట్ మిషన్ అనిల్ రావిపూడికి మెగా గిఫ్ట్.. లగ్జరీ కారు ధర వైరల్..

టాలీవుడ్‌లో సక్సెస్ అనే పదానికి కేరాఫ్ అడ్రస్గా మారారు దర్శకుడు అనిల్ రావిపూడి. పటాస్ నుంచి మొదలైన ఆయన విజయయాత్ర, ఇప్పుడు ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (MSG) వరకు ఎక్కడా బ్రేక్ లేకుండా సాగింది. వరుసగా తొమ్మిది హిట్లు కొట్టి సరికొత్త మైలురాయిని దాటిన అనిల్, ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో ఎక్కడ చూసినా అనిల్ పేరే వినిపిస్తోంది. బాక్సాఫీస్ వద్ద అపజయం ఎరుగని దర్శకుడిగా ఆయన సృష్టించిన రికార్డులకి, భారీ ఆఫర్స్‌తో పాటుగా కాస్ట్లీ గిఫ్ట్స్ కూడా వస్తున్నాయి. 

ఈ సందర్భంగా.. అనిల్‌ రావిపూడికి చిరంజీవి అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చారు. అల్ట్రా ప్రీమియర్‌ రేంజ్‌ రోవర్‌ స్పోర్ట్ కారును చిరు కానుకగా ఇచ్చారు. ఇప్పుడీ కార్ ధర సోషల్ మీడియాతో పాటుగా మెగా ఫ్యాన్స్లో వైరల్గా మారింది. ఈ కారు విలువ దాదాపు రూ.2 కోట్ల 75లక్షలు ఉంటుందని అంచనా.

సంక్రాంతి కానుకగా వచ్చిన 'మన శంకర వర ప్రసాద్ గారు' మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకి పైగా గ్రాస్ సాధించి, చిరు కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఇంత విలువైన కారును బహుమతిగా అందించడం అనిల్ కెరీర్‌లో మరిచిపోలేని అనుభూతిగా మారింది. గతంలో కూడా చిరంజీవి అనిల్‌కి విలువైన వాచ్ గిఫ్ట్ ఇచ్చి అభిమానులను ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్త రేంజ్ కార్ బహుమతితో మరోసారి అనిల్‌ రావిపూడిని అబ్బురపరిచాడు.

రాజమౌళి తర్వాత ఆ రేంజ్ అనిల్ దేనా?

సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవిని, అనిల్ తనదైన మార్క్ వినోదంతో వెండితెరపై ప్రెజెంట్ చేసిన తీరు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఫుల్ సక్సెస్ మూడ్లో ఉన్న అనిల్ రావిపూడి క్రేజ్ చూసి టాలీవుడ్‌లోని అగ్ర నిర్మాణ సంస్థలు ఆయన ఇంటి ముందు క్యూ కడుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ వంటి పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లు అనిల్ తదుపరి సినిమా కోసం పోటీ పడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది..

అంతే కాదు ఒక సినిమాకు అనిల్ ఏకంగా రూ. 50 కోట్ల పారితోషికం అందుకోబోతున్నారట. కేవలం రెమ్యునరేషన్ మాత్రమే కాకుండా, సినిమా లాభాల్లో వాటా (Profit Sharing) కూడా ఇచ్చేందుకు నిర్మాతలు బేరమాడుతున్నట్లు సమాచారం. ఇదే గనుక నిజమైతే, టాలీవుడ్‌లో ఎస్.ఎస్. రాజమౌళి తర్వాత అత్యధిక పారితోషికం అందుకునే దర్శకుల జాబితాలో అనిల్ రావిపూడి టాప్ ప్లేస్‌కు చేరుకుంటారని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి..