బ్లింకిట్ లో ఆర్డర్ చేస్తుంటారా..? కూకట్ పల్లి రెయిన్ బో విస్టాస్ లో ఏమైందో చూడండి.. !

బ్లింకిట్ లో ఆర్డర్ చేస్తుంటారా..? కూకట్ పల్లి రెయిన్ బో విస్టాస్ లో ఏమైందో చూడండి.. !

కూకట్ పల్లిలోని రెయిన్ బో విస్టాస్ గేటెడ్ కమ్యూనిటీలో బ్లింకిట్ డెలివరీ బాయ్స్ హల్ చల్ చేశారు. రూల్స్ ప్రకారం పర్మిషన్ లెటర్ అడిగినందుకు సెక్యూరిటీ గార్డులపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఆదివారం ( జనవరి 25 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... ఒక బ్లింకిట్ డెలివరీ బాయ్ సరైన అనుమతి లేకుండా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా, అక్కడి సెక్యూరిటీ గార్డు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన సదరు డెలివరీ బాయ్, తన సహచరులను అక్కడికి పిలిపించి దాడికి పాల్పడ్డాడు.

గూంపుగా వచ్చిన ఇతర డెలివరీ బాయ్స్ విచక్షణారహితంగా సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు గార్డులకు తీవ్ర గాయాలయ్యాయి.దాడికి సంబంధించిన దృశ్యాలన్నీ అక్కడి కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దీంతో గేటెడ్ కమ్యూనిటీ యాజమాన్యం కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ క్రమంలో రెయిన్ బో విస్టాస్ గేటెడ్ కమ్యూనిటీలో బ్లింకిట్ సర్వీసులపై తాత్కాలిక నిషేధం విధించింది యాజమాన్యం. రెయిన్ బో విస్టాస్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.