ఖార్గ్ ద్వీపంపై దాడికీ ఇరాన్ ప్రతీకారం.. బాగ్దాద్‌లోని అమెరికాఎంబసీపై డ్రోన్లతో దాడి

ఖార్గ్ ద్వీపంపై దాడికీ ఇరాన్ ప్రతీకారం.. బాగ్దాద్‌లోని అమెరికాఎంబసీపై డ్రోన్లతో దాడి

ఇరాక్​రాజధాని బాగ్దాద్​లోని అమెరికా రాయబార కార్యాలయంపై ఇరాన్​ డ్రోన్​ దాడి చేసింది. డ్రోన్ దాడిలో అమెరికా ఎంబసీ  కాంప్లెక్స్ నుంచి  పెద్ద ఎత్తున పొగలు  లేచాయి.  అమెరికా ఎంబసీపై దాడిని  ఇరాక్​ భద్రతా అధికారి, స్థానిక మీడియా  శనివారం (మార్చి14)ధృవీకరించాయి. ఇరాన్​ లో కీలక చమురు కేంద్రమైన ఖార్గ్​ ద్వీపైం దాడులు తర్వాత ట్రంప్​ హెచ్చరికల నడుమ అమెరికా  ఎంబసీపై ఇరాన్​ డ్రోన్​ చేసింది. 

ఇరాన్‌లోని ఖార్గ్ ద్వీపం చమురు కేంద్రం పెట్రోలియం మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరించారు. ఖార్గ్​ ద్వీపంలోని సైనిక లక్ష్యాలను  పూర్తిగా తుడిచిపెట్టిందని ట్రంప్​ తన సోషల్​ మీడియా ప్లాట్ ఫాం ట్రూత్​ లో పోస్ట్​ చేశారు.  ఇరాన్ 90% చమురు రవాణా ఎగుమతి టెర్మినల్ ఈ ఖార్గ్​ ద్దీపం. ఇది జలసంధికి వాయువ్యంగా 483 కి.మీ దూరంలో ఉంది.

అమెరికా దాడులు ఖార్గ్ చమురు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోలేదుగానీ హార్ముజ్ జలసంధి గుండా నౌకలను అడ్డుకుంటే  చమురు కేంద్రాలపై కూడా దాడులు చేస్తామని ట్రంప్​ హెచ్చరించారు. అమెరికా దాడుల నుంచి ఇరాన్‌ను రక్షించుకునే సామర్థ్యం లేదని అన్నారు.  ఇరాన్ సైన్యం,దాని ఉగ్రవాద సంస్థలు తమ ఆయుధాలను విడిచిపెట్టి, వారి దేశంలో మిగిలి ఉన్న వాటిని కాపాడుకోవడం మంచిదని  ఆయన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.

మరోవైపు అమెరికా దాడి తర్వాత ఖార్గ్ చమురు మౌలిక సదుపాయాలకు ఎటువంటి నష్టం జరగలేదని ఇరాన్ మీడియా తెలిపింది.. ఖార్గ్ ద్వీపంపై అమెరికా దాడుల్లో చమురు మౌలిక సదుపాయాలకు ఎటువంటి నష్టం జరగలేదని ఇరాన్ మీడియా శనివారం నివేదించింది.