ఈ కాలంలో వేళకు ఏదో తినేసామంటే తినేస్తున్నామంటే సమస్యలు తప్పవు. తినే ఫుడ్ పై మనసు పెట్టకపోతే శరీరానికి పోషకాలు సరిగ్గా అందవని దానివల్ల అనారోగ్య సమస్యలు, మానసిక ఆందోళన తప్పవని చెబుతున్నారు పరిశోధకులు. ఇటీవల జరిగిన ఒక పరిశోధనలో ఈవిషయాలు వెల్లడయ్యాయి.
బరువు తగ్గేందుకు డైట్ పాటిస్తున్న 53 మందిపై ఆరు నెలలు అధ్యయనం చేసి ఆసక్తికర విషయాలను గుర్తించారు. మైండ్ ఫుల్ ఈటింగ్ కు సంబంధించి మూడు నాలుగు సెషన్స్ కు హాజరైన వారు సగటున మూడు కిలోల బరువు తగ్గారట. ఒకటి,రెండు సెషన్లకు వచ్చినవాళ్ల మాత్రం కిలో మాత్రమే తగ్గారట. పండుగలు, సెలవు రోజుల్లో కుటుంబం, స్నేహితులతో కలిసి వివిధ రకాల ఆహారపదార్ధాలను కడుపునిండా లాగించేస్తాం. తీరా బరువు పెరిగి, మునుపటి షేప్ కి వచ్చేందుకు కసరత్తులు చేస్తూ నానా కష్టాలు పడతాం.. అయితే ఈ సమస్యకు పరిష్కారం చెబుతున్నారు.. సైంటిస్టులు ..
మనసుపెట్టి పనిచేయడం వల్ల ఉద్దేకం తగ్గి, ఆలోచనల మీద గురి ఉంటుంది. ఒత్తిడి తగ్గి, అదనపు శక్తి సమకూరి, రెట్టించిన ఉత్సాహం. సొంతమవుతుంది. అదే విధంగా మనసుపెట్టి తినడం వల్ల కూడా ఆహారాన్ని సంతృప్తిగా తినడం అలవాటు అవుతుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి కూడా పటిష్ఠమవుతుందని అంటున్నారు పరిశోధకులు.
–వెలుగు, లైఫ్–
