లక్సెట్టిపేట వెలుగు: మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలంలోని సూరారం గ్రామంలో నూతనంగా నిర్మించిన అభయాంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి, అభివృద్ధి పనులకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రూ.50 వేలు విరాళం అందజేశారు. జిల్లా జాగృతి నాయకుడు ప్రశాంత్ శుక్రవారం ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు.
కవిత బర్త్డే సందర్భంగా విరాళంతోపాటు భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. జాగృతి యువజన రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నిషా లెనిన్, రవి గౌడ్, మారుతి, రవి కిరణ్, హర్షవర్ధన్, స్వరాజ్ పాల్గొన్నారు.
