కోల్బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణానికి చెందిన పేద యువతి పెండ్లికి శుక్రవారం కాంగ్రెస్ రాష్ట్ర లీడర్, అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ప్రెసిడెంట్బండి సదానందం యాదవ్ రూ.21,116 నగదుతో పాటు పెండ్లి బట్టలు, ఇతర సామగ్రిని అందించారు.
పట్టణానికి చెందిన మియాపూరం రాంచందర్చారి-సరిత దంపతుల కూతురైన మాధురి వివాహం ఈనెల 15న ఉంది. సదానందంయాదవ్ను వివాహానికి ఆహ్వానిస్తూ తమకు ఆర్థికసాయం చేయమని కోరడంతో ఆయన స్పందించారు. సదానందంయాదవ్ గతంలో కూడా పలు కుటుంబాలకు వివిధ రూపాల్లో సాయం చేసి ఆదుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు అభినందించారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు. ----
