విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు : కలెక్టర్ కుమార్ దీపక్

విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు : కలెక్టర్ కుమార్ దీపక్

నస్పూర్, వెలుగు: విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ లో, నస్పూర్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల విద్యాలయాలను ఆకస్మికంగా సందర్శించారు.  భోజనశాల, వంటశాల, అత్యవసర సామగ్రి నిల్వలు, విద్యార్థుల హాజరు పట్టిక, పాఠశాల పరిసరాలను పరిశీలించారు.

కలెక్టర్ మాట్లాడుతూ..ప్రభుత్వం విద్యారంగ బలోపేతానికి అనేక చర్యలు తీసుకుంటుందని, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో మౌలిక వసతులు కల్పిస్తుందన్నారు. అనంతరం పాత మంచిర్యాల ప్రాంతంలో చేపట్టిన ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలు తీరును మేయర్ దర్ని మధుకర్ తో కలిసి పరిశీలించారు. మంచిర్యాల ఆర్డీఓ ఆఫీసును సందర్శించి జిల్లాలో జాతీయ రహదారి విస్తరణలో భూసేకరణ దరఖాస్తులను తనిఖీ చేశారు.