కులూ మనాలిలో భారీగా మంచు.. చిన్న కార్లకే ఎంట్రీ

కులూ మనాలిలో భారీగా మంచు.. చిన్న కార్లకే ఎంట్రీ
  • హిమాచల్‌‌‌‌లోకి ప్రయాణాలపై ప్రభుత్వం ఆంక్షలు

మనాలి: హిమాచల్‌‌‌‌ ప్రదేశ్‌‌‌‌లోని కులూ మనాలిలో భారీగా మంచు కురుస్తోంది. ఎత్తయిన ప్రాంతాల్లో ఆక్సిజన్‌‌‌‌ లెవెన్స్‌‌‌‌ పడిపోగా, విజిబిలిటీ కూడా తగ్గిపోయింది. మరోవైపు మనాలి అందాలు చూసేందుకు టూరిస్టులు భారీగా తరలివస్తుండటంతో తీవ్ర ట్రాఫిక్‌‌‌‌ జామ్‌‌‌‌ ఏర్పడుతోంది. దీంతో హిమాచల్‌‌‌‌ సర్కారు ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. చిన్నకార్లు, 4*4 వాహనాలను మాత్రమే మనాలిలోకి అనుమతిస్తామని ప్రకటించింది. 

హెవీ వెహికల్స్‌‌‌‌, పొడవాటి కార్లు, వెహికల్స్‌‌‌‌కు నో ఎంట్రీ అని చెప్పింది. తీవ్రంగా మంచు కురుస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా లాహౌల్‌‌‌‌, స్పితి, చంబా, కులు, మండి, కిన్నౌర్‌‌‌‌ తదితర ప్రాంతాల్లోని‌‌‌‌ 685 రోడ్లను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. హిమాచల్‌‌‌‌వ్యాప్తంగా వచ్చే వారంపాటు విపరీతంగా మంచు కురవొచ్చని భారత వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది.

అయితే, గతవారంరోజులుగా విజిబిలిటీ తక్కువగా ఉండటం, మంచు కురుస్తుండటంతో వెహికల్స్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ కాక ఒకటికొకటి గుద్దుకున్న పరిస్థితులున్నాయి. దీంతో ట్రాఫిక్‌‌‌‌ జామ్‌‌‌‌ ఏర్పడి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.