ముగిసిన పీడీఎస్యూ రాష్ట్ర మహాసభలు..నూతన కార్యవర్గం ఎన్నిక

ముగిసిన పీడీఎస్యూ రాష్ట్ర మహాసభలు..నూతన కార్యవర్గం ఎన్నిక

ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం నగరంలో జరిగిన పీడీఎస్ యూ రాష్ట్ర 23వ మహాసభలు సోమవారం ముగిశాయి. కేంద్ర, -రాష్ట్ర ప్రభుత్వాల విద్యా వ్యతిరేక విధానాలు, ప్రైవేటీకరణ, -కమర్షియలైజేషన్, దాడులు, ఫీజుల భారం, నిరుద్యోగం వంటి సమస్యలపై విస్తృతంగా చర్చించి పలు తీర్మానాలు చేశారు. విద్యా హక్కును కాపాడేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు. మహాసభల్లో రాష్ట్ర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 

రాష్ట్ర అధ్యక్షుడిగా కంపాటి పృథ్వీ, ప్రధాన కార్యదర్శి ఎస్.అనిల్, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బి.నర్సింహారావు, ఎం.నరేందర్, ఎస్.రాకేశ్, దీక్షిత, మునిగెల శివప్రశాంత్, సహాయ కార్యదర్శులుగా వంగూరి వెంకటేశ్, సురేశ్, కర్కా గణేశ్, బోయినపల్లి అజయ్, వీరభద్రం, కోశాధికారిగా అంగిడి కుమార్ తో పాటు రాష్ట్ర కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. విద్యాలయాల్లో కులం, మతతత్వం, లింగ వివక్ష, మూఢాచారాలకు వ్యతిరేకంగా చైతన్యం పెంపొందించే పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలని, ఎస్సీ, ఎస్టీ సబ్​ప్లాన్  నిధులు ఖర్చు చేయాలని, బీసీ సబ్​ప్లాన్  చట్టం చేయాలని తీర్మానించారు.