సిలిండర్లను బ్లాక్ చేస్తే కఠిన చర్యలు

సిలిండర్లను బ్లాక్ చేస్తే కఠిన చర్యలు

భద్రాద్రికొత్తగూడెం/ జనగామ అర్బన్/ ఖమ్మం టౌన్, వెలుగు : గ్యాస్​ సిలిండర్లను బ్లాక్ మార్కెట్​కు తరలించినా, అక్రమంగా నిల్వ ఉంచినా కఠిన చర్యలు తీసుకుంటామని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్, జనగామ కలెక్టర్​ సందీప్​ కుమార్​ ఝా హెచ్చరించారు. శనివారం వారు ఆయా కలెక్టరేట్లలో జిల్లా ఆఫీసర్లు, ఎల్పీజీ సేల్స్​ ఆఫీసర్లు, డిస్ట్రిబ్యూషన్​ ఏజెన్సీల వారితో కలిసి సమీక్ష నిర్వహించారు. జిల్లాలో కృత్రిమ గ్యాస్ కొరత సృష్టించవద్దని చెప్పారు.

ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్​, గురుకులాలకు గ్యాస్​ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డొమెస్టిక్​ గ్యాస్​ సిలెండర్లను కమర్షియల్​గా ఉపయోగించే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు.  కాగా, ఖమ్మం సిటీలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో జిల్లా సివిల్​ సప్లైస్​ ఆఫీసర్​ చందన్​ కుమార్​ పర్యవేక్షణలో తనిఖీలు నిర్వహించి, 20 డొమెస్టిక్​ సిలిండర్లను పట్టుకున్నారు.