పోలీస్ పరీక్షల్లో ఆంక్షలపై యూపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సీరియస్...కీలక ఆదేశాలు..

పోలీస్ పరీక్షల్లో ఆంక్షలపై యూపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సీరియస్...కీలక ఆదేశాలు..

యూపీ పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్షల్లో అభ్యర్థి చేతికి ఉన్న కాలవా దారాన్ని కట్ చేయడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వివాదాన్ని సీరియస్ గా తీసుకున్న యూపీ పోలీస్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్స్ బోర్డు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. 

ఎగ్జామ్ సెంటర్ బయట పోలీస్ సిబ్బంది అభ్యర్థి కాలవా దారాన్ని కత్తిరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. హిందువులు పవిత్రంగా భావించి ధరించే కాలవాను పరీక్షల్లో మోసం చేయడానికి ఉపయోగిస్తారని అనడం దారుణమని అంటున్నాయి హిందూ సంఘాలు.

ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న UPPRPB అభ్యర్థులు ధరించే మతపరమైన చిహ్నాలను తొలగించకూడదని.. కత్తిరించకూడదని తెలిపింది. ఈమేరకు అధికారులకు ఇప్పటికే స్పష్టమైన సూచనలు జారీ చేసినట్లు పేర్కొంది.

►ALSO READ | ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.. నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో గురించి ప్రస్తావిస్తూ... అభ్యర్థులు ధరించి కాలవా, మంగళసూత్రం లాంటి ఇతర మతపరమైన, సాంస్కృతిక చిహ్నాలను తొలగించొద్దని ఆదేశాలు జారీ చేసింది బోర్డు.వీధిలో అభ్యర్థి కాలవా కత్తిరిస్తున్న సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించింది బోర్డు. ఈమేరకు వారణాసి కమిషనర్ కు లేఖ కూడా పంపినట్లు తెలిపింది.