న్యూఢిల్లీ: దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. తమిళనాడు, కేరళ, అస్సాం, వెస్ట్ బెంగాల్ నాలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం (మార్చి 15) ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించారు. వెస్ట్ బెంగాల్లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనుండగా.. కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. 2026, మే 4వ తేదీన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం
- తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్
- కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న పోలింగ్
- వెస్ట్ బెంగాల్ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ ఏప్రిల్ 23
- వెస్ట్ బెంగాల్ సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ ఏప్రిల్ 29న
- మే 4 తారీఖున ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్
