న్యూఢిల్లీ: ఏప్రిల్ 1, 2026 నుంచి ఫాస్టాగ్ వార్షిక పాస్ ఫీజును (#FASTag Annual Pass) రూ. 3 వేల నుంచి రూ.3 వేల 75 రూపాయలకు పెంచుతున్నట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రకటించింది. ప్రభుత్వం శనివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. కొత్త రేటు ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వస్తుంది. జాతీయ రహదారుల రుసుము (రేట్లు, వసూలు నిర్ణయం) నియమాలు, 2008 నిబంధనల ప్రకారం ఈ సవరణ జరిగింది.
Attention National Highway Users!
— NHAI (@NHAI_Official) March 15, 2026
Effective 1st April 2026, the applicable fee for the #FASTagAnnualPass will be revised from ₹3,000 to ₹3,075 for FY 2026–27 in accordance with the National Highways Fee (Determination of Rates and Collection) Rules, 2008.
The Annual Pass… pic.twitter.com/nOhjyrcBoB
వాహనదారులు ఇప్పటి దాకా రూ.3 వేలు చెల్లించి ఈ వార్షిక పాసు తీసుకుంటే ఏడాదిలో 200 సార్లు ఉచితంగా టోల్ గేట్ గుండా వెళ్లేందుకు అనుమతిస్తారు. అంటే సగటున ఒక్కసారి టోల్ గేట్ దాటేందుకు రూ.15 ఖర్చు అవుతోంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15, 2025 నుంచి ఈ వార్షిక పాస్ను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ వార్షిక పాస్ రేటు 75 రూపాయలు పెరగడం గమనార్హం.
యాన్యువల్ పాస్ కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ?
* పాస్ తీసుకోవాలంటే.. ముందుగా ప్లే స్టోర్ నుంచి రాజ్మార్గ్ యాత్ర యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి.
* నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ఏఐ) వెబ్ సైట్ నుంచి కూడా ఈ పాస్ తీసు కోవచ్చు. మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. తర్వాత యాప్ ఓపెన్ అవుతుంది.
* లాంగ్వేజ్ సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత యాన్యువల్ పాస్ను సెలక్ట్ చేసుకోవాలి.
* కమర్షియల్ వెహికల్స్, కారు, జీప్, యాక్టివ్ ఫాస్ట్యాగ్ ఉన్నవాళ్లే అర్హులని చూపిస్తుంది.
* తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ హైవేలపై ఉన్న టోల్ ప్లాజా మ్యాప్ ప్రత్యక్షం అవుతుంది. ఒక టోల్ ప్లాజాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింగిల్ జర్నీకి ఎంత, రిటర్న్ జర్నీకి ఎంత, నెల పాస్ ఎంత అనే వివరాలు కనిపిస్తాయి.
* తర్వాత వెహికల్ నంబర్ ఎంటర్ చేస్తే పేమెంట్ మోడల్ లోకి వెళ్తాం. యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేయాలి. సక్సెస్ఫుల్ అని వస్తది.
* ఎక్స్ ప్రెస్ వేపై ఎన్ని టోల్ ప్లాజాలు ఉన్నా.. ఎగ్జిట్ దగ్గర టోల్ కట్ అవుతుంది. అప్పుడు ఇది ఒకే ట్రిప్ కిందికి వస్తుంది.
* రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్ కలిపి మొత్తం 36 టోల్ ప్లాజాలు ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ నేషనల్ హైవే ఎన్ 65 మీద 3 ఉండగా (2 తెలంగాణ, ఒకటి ఏపీ). హైదరాబాద్ – బెంగళూరు హైవే ఎన్ హెచ్ 44 మీద 3, హైదరాబాద్– నాగ్పూర్ నేషనల్ హైవే 44 మీద అత్యధికంగా 5 టోల్ ప్లాజాలు ఉన్నాయి.
