హన్సిక–సోహెల్ విడాకులు: నాకు పెయిడ్ PR టీమ్ లేదు.. ఇది ‘నకిలీ ప్రపంచం’ అంటూ మాజీ మరదలు సంచలన పోస్ట్

హన్సిక–సోహెల్ విడాకులు: నాకు పెయిడ్ PR టీమ్ లేదు.. ఇది ‘నకిలీ ప్రపంచం’ అంటూ మాజీ మరదలు సంచలన పోస్ట్

హీరోయిన్ హన్సిక తన భర్త సోహెల్ ఖతూరియాతో విడాకుల తీసుకున్న విషయం తెలిసిందే. 2022లో వివాహం చేసుకున్న ఈ జంటకు (2026 మార్చి 11న) ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఈ విషయాన్ని వారి న్యాయవాది అద్నాన్ షేక్ ధృవీకరించారు. ఈ పరిణామాల మధ్య హన్సిక తమ్ముడి మాజీ భార్య.. అంటే హన్సిక మాజీ మరదలు, టీవీ నటి ముస్కాన్ నాన్సీ జేమ్స్ సోషల్ మీడియాలో పరోక్షంగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మార్చి 13న నాన్సీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్టు చేసింది. “కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు ఒక అభ్యర్థన.. దయచేసి నన్ను ఇతరుల వ్యక్తిగత జీవితాలతో కలపకండి. మీరు ఎప్పుడూ నాకు మద్దతుగా ఉన్నందుకు థ్యాంక్స్. కానీ ఎవరో ఒకరి పూర్తిగా నకిలీ ప్రపంచంతో నన్ను అనుసంధానం చేయొద్దు. నాకు ఎలాంటి పెయిడ్ PR లేదు. నిజం బయటపడటానికి సమయం పడుతుంది. ‘సబ్ సమయ్ కా ఖేల్ హై.’ శాంతి, ప్రేమ, కర్మ.” అని నాన్సీ రాసుకొచ్చింది. ఇపుడు ఈ వ్యాఖ్యలు హన్సికను ఉద్దేశించి చేసినవేనని నెటిజన్లు భావిస్తున్నారు.

డొమెస్టిక్ వైలెన్స్ కేసు వివాదం..

2024 డిసెంబర్ 18న నాన్సీ, తన భర్త మరియు హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానిపై గృహ హింస ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముంబైలోని అంబోలీ పోలీస్ స్టేషన్‌లో ఆమె FIR నమోదు చేశారు. ఈ కేసులో ప్రసాంత్ మోత్వాని, వారి తల్లి మోనా మోత్వాని, అలాగే హన్సిక పేర్లు కూడా చేర్చబడ్డాయి.

►ALSO READ | హీరోయిన్ పూర్ణకు పాప పుట్టింది.. కుమార్తెకు ‘దువా జమీలా’ పేరు.. అర్థం తెలిస్తే శభాష్ అంటారు!

ఫిర్యాదులో భాగంగా, గృహ హింస కారణంగా తాను బెల్స్ పాల్సీ (Bell’s Palsy) అనే ఆరోగ్య సమస్యకు గురయ్యానని నాన్సీ పేర్కొన్నారు. ఈ వ్యాధి వల్ల ముఖం ఒక వైపు కండరాలు తాత్కాలికంగా బలహీనపడటం లేదా పక్షవాతం రావడం జరుగుతుంది. నాన్సీ మరియు ప్రసాంత్ 2020లో వివాహం చేసుకున్నారు. అయితే 2022లో విడిపోయి గత రెండేళ్లుగా వేర్వేరుగా జీవిస్తున్నారు.

హన్సిక – సోహెల్ విడాకుల తర్వాత పరిణామాలు

విడాకుల తర్వాత హన్సిక తన సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి భర్త సోహెల్తో ఉన్న పెళ్లి ఫోటోలు, వీడియోలతో సహా అన్నీ తొలగించింది. ప్రస్తుతం హన్సిక ఇన్‌స్టాగ్రామ్‌లో కేవలం వ్యక్తిగత ఫోటోలు మరియు బ్రాండ్ ప్రమోషన్లు మాత్రమే కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. డిసెంబర్ 4, 2022 హన్సిక, సోహెల్ ఖతూరియా వివాహం జరిగింది. జులై 2, 2024 నుంచి ఈ ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. ఆంటే పెళ్లైన కొన్నాళ్లు మాత్రమే ఈ ఇద్దరూ కలిసి ఉన్నారు. ఆ తర్వాత అభిప్రాయ భేదాల కారణంగా ఎవరికి వారు విడిగా జీవిస్తున్నారు.

అయితే, వీరి వివాహాన్ని ‘లవ్‌ షాదీ డ్రామా’ అనే పేరుతో డాక్యుమెంటరీ సిరీస్‌గా కూడా విడుదల చేయడం గమనార్హం.  ఇప్పుడు ఈ విడాకుల నేపథ్యంలో హన్సిక వ్యక్తిగత జీవితం సోషల్ మీడియాలో మళ్లీ చర్చనీయాంశంగా మారింది.