టాలీవుడ్ హీరోయిన్ పూర్ణ రెండోసారి పండండి బిడ్డకు జన్మనిచ్చింది. శనివారం (2026 మార్చి 14) తెల్లవారుజామున ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియాలో వెల్లడించింది. తన జీవితంలోకి వచ్చిన ఈ చిన్నారి దేవుడిచ్చిన అపురూపమైన కానుక అని పూర్ణ ఆనందం వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా ఫోటో షేర్ చేస్తూ “అల్లాహ్ నా జీవితాన్ని మరో విలువైన బహుమతితో ఆశీర్వదించాడు. ఈ రోజు తెల్లవారుజామున 4:25 గంటలకు, ఫజ్ర్ సమయానికి దగ్గరగా మాకు ఆడబిడ్డ పుట్టింది. పాప పుట్టిన వెంటనే ఆమె చెవుల్లో అధాన్ మరియు ఇఖామత్ చదివాం. మా కుమార్తెకు ‘దువా జమీలా’ అనే పేరు పెట్టాం. ఆమెకు దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యం, బలమైన ఈమాన్ కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం.
అలాగే, ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా డెలివరీ జరిగినందుకు భగవంతుడికి మరియు సహకరించిన ఆస్పత్రి వైద్య బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.”అని పూర్ణ పోస్ట్ చేసింది. ఈ సంతోషకరమైన వార్త తెలిసిన వెంటనే అభిమానులు సోషల్ మీడియాలో పూర్ణకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అయితే, పాపకు ‘దువా జమీలా’ అని పేరు పెట్టడంతో దాని అర్థం ఏమిటో తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తిగా సెర్చ్ చేస్తున్నారు. ‘దువా జమీలా’ (Dua-e-Jameela) అనే పేరు అరబిక్ భాషలో “అందమైన ప్రార్థన” అనే అర్థాన్ని సూచిస్తుంది. ఇందులో ‘దువా’ అంటే ప్రార్థన లేదా మనస్పూర్తిగా చేసే అభ్యర్థన, ‘జమీలా’ అంటే అందమైనది లేదా సుందరమైనది అని అర్థం.
►ALSO READ | Namo Re Song: వేలాది డ్యాన్సర్లతో గ్రాండ్‌గా ‘నమో రే నమోరే’.. విజువల్ స్పెక్టాకిల్‌గా ‘నాగబంధం’ ఫస్ట్ సాంగ్
ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం ‘దువా జమీలా’ అనేది అల్లాహ్ యొక్క పవిత్రమైన పేర్లు మరియు ఆయన గుణగణాలను స్తుతిస్తూ, రక్షణ మరియు ఆశీర్వాదాల కోసం చేసే ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక ప్రార్థనగా భావిస్తారు.
కేరళకు చెందిన పూర్ణ అసలు పేరు షమ్న ఖాసిమ్. ఆమె దుబాయ్కి చెందిన బిజినెస్ మ్యాన్ జేబీఎస్ కంపెనీ వ్యవస్థాపకుడు షానిద్ ఆసిఫ్ వివాహం చేసుకున్నారు. 2022లో దుబాయ్‌లో వీరి వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇప్పటికే ఒక కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు పాప కూడా జన్మించడంతో పూర్ణ కుటుంబంలో సంబరాలు మొదలయ్యాయి.
Fame may shine, but motherhood is my true crown. As I wait for my second little miracle, my heart smiles knowing a loving big brother is ready to welcome a new best friend into this world. #mother #pregnancy pic.twitter.com/f8f4eVI31W
— Purnaa (@shamna_kkasim) January 21, 2026
