ఆసిఫాబాద్: కుమ్రం బీమ్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడింది. గ్యా్స్ ఏజెన్సీ, గోడౌన్ నిర్వాహకులు నో స్టాక్ బోర్డు పెట్టి తాళం వేసి వెళ్లిపోయారు. కార్యాలయం మూసివేసి ఉన్న తర్వాత తాళం చూసి తిరిగి వెళ్లిపోతున్నారు. గత రెండు రోజులుగా సిలిండర్లు ఇవ్వడం లేదని స్థానికులు చెప్పారు.
సిలిండర్ల కొరతను తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. దేశవ్యాప్తంగా నెలకొన్న వంటగ్యాస్ సరఫరా ఒత్తిడిని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ముందస్తు చర్యలు చేపట్టింది. సుమారు 29 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల పంపిణీని ఇప్పటికే పునరుద్ధరించినట్లు పెట్రోలియం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ వెల్లడించారు.
►ALSO READ | ఆధారాలు బయటపెడితే బద్నాం చేస్తరా...? ప్రభుత్వంపై పరువు నష్టం దావా వేస్త: మాజీ ఎమ్మెల్సీ కవిత
ప్రధానంగా హోటళ్లు, రెస్టారెంట్లు మరియు చిన్న తరహా పరిశ్రమలకు ఇబ్బంది కలగకుండా ఈ సరఫరాను క్రమబద్ధీకరిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. వ్యాపార అవసరాలకు సరఫరాను పునరుద్ధరిస్తూనే సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా గృహ వినియోగదారులకే ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
ప్రస్తుతం వినియోగదారుల్లో నెలకొన్న ఆందోళన కారణంగా గ్యాస్ బుకింగ్‌లు భారీగా పెరిగాయి. సాధారణంగా రోజుకు 55 లక్షలుగా ఉండే బుకింగ్‌లు, ప్రస్తుతం 88 లక్షలకు చేరాయి. అయితే, దేశంలో తగినంత స్టాక్ ఉందని, వినియోగదారులు ఆందోళనతో ‘పానిక్ బుకింగ్’ చేయొద్దని ప్రభుత్వం పేర్కొంది.
