ఖమ్మం జిల్లాలో దారుణం: HM మందలించిందని.. ఆశ్రమ పాఠశాల విద్యార్థిని ఆత్మహత్య..

ఖమ్మం జిల్లాలో దారుణం: HM మందలించిందని.. ఆశ్రమ పాఠశాల విద్యార్థిని ఆత్మహత్య..

ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని ముదిగొండ మండలంలో ఉన్న వల్లభి ప్రభుత్వ బాలికల ఆశ్రమ పాఠశాలలో HM, హాస్టల్ వర్కర్ మందలించారని తొమ్మిదవ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం ( మార్చి 15 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..

ఖమ్మం న్యూ అగ్రహారానికి చెందిన చింతకాయల శ్వేత వల్లభి ప్రభుత్వ బాలికల ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతోంది.HM, హాస్టల్ వర్కర్ మందలించడంతో మనస్తాపానికి గురై ఐరన్ టాబ్లెట్లు వేసుకొని ఆత్మహత్య చేసుకుంది శ్వేత.

►ALSO READ | నల్లగొండ జిల్లా నాంపల్లిలో ఆటోను ఢీకొట్టిన లారీ.. నలుగురు స్పాట్ డెడ్.. ఐదుగురికి సీరియస్

ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు విచారణకు ఆదేశించారు. బాలిక మృతికి కారణమైన HM, హాస్టల్ వర్కర్ ను డిస్మిస్ చేసి హత్యాయత్నం కేసు నమోదు చేయలేని ఆదేశించారు. ఈ క్రమంలో బాలిక మృతదేహంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా చేపట్టారు ఖమ్మం జిల్లా వామపక్ష విద్యార్ధి సంఘాలు.