మైక్రోసాఫ్ట్ ఎక్సెల్‌ని డైలీ లైఫ్‌లో చాలామంది వాడుతుంటారు. చాలా కంపెనీలు ఇప్పటికీ రకరకాల అవసరాలకు దాన్నే వాడుతున్నాయి. అయితే.. ఇప్పుడు ఆంథ్రోపిక్ ఏఐ అసిస్టెంట్ క్లాడ్‌తో ఎక్సెల్‌ని ప్రత్యేకంగా నేర్చుకోకుండానే ఈజీగా ఉపయోగించవచ్చు. డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారా మల్టీపుల్ ఎక్సెల్ ఫైల్స్‌ని క్లాడ్‌లో అప్‌లోడ్ చేయొచ్చు. షీట్‌లో మనకు కావాల్సిన మార్పులను ప్రాంప్ట్ ద్వారా చెప్తే.. అది క్షణాల్లో మార్చేసి ఇస్తుంది.
అంథ్రోపిక్ షేర్ చేసిన డెమో వీడియో ప్రకారం.. క్లాడ్ అనేక ఎక్సెల్ ఫైళ్లలో ఒకేసారి మార్పులు చేయగలదు. మాన్యువల్‌గా చేసే దాదాపు అన్ని పనులు దీంతో చేయొచ్చు. అంతేకాదు.. ఇది ఎక్సెల్‌లోని తప్పులను కూడా సరిచేస్తుంది. సంక్లిష్టమైన స్ప్రెడ్‌షీట్‌లను మేనేజ్ చేయడంలో ఎంతగానో సాయం చేస్తోంది. ఏఐ బేస్డ్ ఫైనాన్స్‌కు ఈ అప్‌డేట్ మొదటి మెట్టు అని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.
