హైదరాబాద్, వెలుగు: నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) రాష్ట్ర అధ్యక్షుడిగా గవ్వల భరత్ కుమార్ నియమితులయ్యారు. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల ఇన్‌చార్జ్‌గా కొనసాగుతున్న ఆయన సేవలను గుర్తించిన పార్టీ అధిష్టానం, తాజాగా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను అప్పగించింది.
గతంలో బీసీ జాతీయ సంక్షేమ సంఘం, బీసీ యువజన, విద్యార్థి సంఘాల్లో భరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ జాతీయ అధ్యక్షుడు, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా భరత్ కుమార్ మాట్లాడారు. రాష్ట్రంలో పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేస్తానని, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు.
