హైదరాబాద్, వెలుగు: తెలంగాణ మోడల్ స్కూల్స్ టీచర్లకు రావాల్సిన 5 డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ మోడల్ స్కూల్స్ టీచర్స్ అసోసియేషన్ (టీఎంఎస్టీఏ) రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు గురువారం సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణాను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2021 జూలై నుంచి 2025 డిసెంబర్ వరకు టీచర్లకు రావాల్సిన డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. మోడల్ స్కూళ్లలో ఒక్కో ప్రిన్సిపాల్‌కు రూ.3.90 లక్షలు, ఒక్కో పీజీటీకి రూ.3.10 లక్షలు, ఒక్కో టీజీటీకి రూ.2.60 లక్షల వరకు బకాయిలు రావాల్సి ఉందని వివరించారు. ఏండ్ల తరబడి డీఏలు పెండింగ్‌లో ఉండడంతో టీచర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
