- శిల్పకళావేదికలో మ్యూజికల్ నైట్
హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రముఖ తెలుగు సినీ గీత రచయిత వేటూరి సుందరరామమూర్తి 90వ జయంతిని జనవరి 28న మదాపూర్ శిల్పకళావేదికలో నిర్వహించనున్నామని వేటూరి సాహిత్యాభిమాన సమితి అమెరికా అధ్యక్షుడు తోటకూర ప్రసాద్, ప్రధాన కార్యనిర్వాహకుడు ఓరుగంటి ధర్మతేజ తెలిపారు. ‘కవికులాలంకార -వేటూరి సాహితీ మహోత్సవం’ పేరిట నిర్వహించనున్న కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని చెప్పారు.
సాయంత్రం 4 గంటలకు మ్యూజికల్నైట్ఏర్పాటు చేశామని, ఇందులో గాయకులు ఎస్పీ చరణ్, ఎస్పీ శైలజ వేటూరి సూపర్హిట్పాటలను ఆలపిస్తారని తెలిపారు. కార్యక్రమంలో వేటూరి కుటుంబసభ్యులు ఆత్మీయ అతిథులుగా పాల్గొంటారని, ఇతర రంగాల ప్రముఖులు కూడా పాల్గొననున్నారని చెప్పారు. ఎంట్రీ పాస్‌లు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు రవీంద్రభారతిలో ఇస్తామన్నారు.
