BSNL రిపబ్లిక్ డే అఫర్.. కేవలం రోజుకు రూ.7కే.. 2.6GB డేటా, ఆన్ లిమిటెడ్ కాల్స్‌..

BSNL రిపబ్లిక్ డే అఫర్.. కేవలం రోజుకు రూ.7కే.. 2.6GB డేటా, ఆన్ లిమిటెడ్ కాల్స్‌..

భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవం(Republic Day) సందర్భంగా  ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL  కస్టమర్ల కోసం ఒక కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ప్లాన్ పేరు BSNL భారత్ కనెక్ట్ 26 ప్లాన్. లిమిటెడ్ అఫర్ కింద వస్తున్న ఈ ప్లాన్ వాలిడిటీ  365 రోజులు. BSNL  సోషల్ మీడియా ద్వారా ఈ స్పెషల్ రిపబ్లిక్ డే రీఛార్జ్ ప్లాన్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ ప్లాన్ గురించి వివరాలు మీకోసం...

BSNL భారత్ కనెక్ట్ 26 ప్లాన్  ధర:
BSNL భారత్ కనెక్ట్ 26 ప్లాన్ ధర రూ.2,626. ఇతర టెలికాం సంస్థలు ఏడాది ప్లాన్‌తో రోజుకు 2.5GB డేటా ఇస్తుండగా..  BSNL మాత్రం ఈ రీఛార్జ్‌తో రోజుకు 2.6GB డేటా ఇస్తుంది.

డైలీ డేటాతో పాటు ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు ఇంకా ఇతర ఏడాది ప్లాన్‌లతో పోలిస్తే డైలీ డేటా పరంగా ఈ ప్లాన్ బెస్ట్ అప్షన్ అని చెప్పొచ్చు.   BSNL ప్రకారం, భారత్ కనెక్ట్ 26 ప్లాన్ 24 జనవరి  నుండి  24 ఫిబ్రవరి  2026 వరకు అందుబాటులో ఉంటుంది. అంటే కస్టమర్లు ఈ ప్లాన్‌ రీఛార్జ్ చేసుకోవడానికి ఒక నెల టైం మాత్రమే ఉంటుంది.

►ALSO READ | ధర పెరిగిందని.. మీ బంగారాన్ని బ్యాంక్ లాకర్లలో దాచారా..? : బ్యాంక్ లో ఏదైనా జరిగితే నష్టపరిహారం, నష్టం ఏంటో తెలుసా..?

బిఎస్ఎన్ఎల్ ప్రస్తుతం 365 రోజుల వాలిడిటీతో  చాల ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తోంది. రూ.2,626 భారత్ కనెక్ట్ 26 ప్లాన్‌ ప్రారంభించడంతో  బిఎస్ఎన్ఎల్ లో ఇప్పుడు మొతం  అన్యువల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు మూడు  ఉన్నాయి.

BSNL ఇతర అన్యువల్ రీఛార్జ్ ప్లాన్స్ :  రూ. 2,399 ప్లాన్, ఇదొక ప్రీపెయిడ్ ప్లాన్.. 365 రోజుల వాలిడిటీ, రోజుకు 2.5GB డేటా, ఆన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు, డైలీ డాటా అయిపోయిన తర్వాత, ఇంటర్నెట్ స్పీడ్  40 Kbpsకి పడిపోతుంది.

BSNL రూ. 2,799 ప్లాన్: ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌ వాలిడిటీ 365 రోజులు, రోజుకు 3GB డేటా,  ఆన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు, డైలీ డేటా అయిపోయిన తర్వాత, డేటా స్పీడ్ 40 Kbpsకి పడిపోతుంది.