పార్క్ చేసిన 15 సెకండ్లలో స్కూటీ చోరీ.. వాటర్ బాటిల్ కోనేలోపే..

పార్క్ చేసిన 15 సెకండ్లలో స్కూటీ చోరీ.. వాటర్ బాటిల్ కోనేలోపే..

బైక్ చోరీలు చాలానే చూసుంటారు కానీ.. ఈ బైక్ చోరీ మాత్రం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని చెప్పాలి. బైక్ పార్క్ చేసి వాటర్ బాటిల్ కోనేలోపే 15 సెకండ్లలోనే బైక్ ఎత్తుకెళ్లాడు కేటుగాడు. అది కూడా బైక్ కొన్న రెండు రోజుల్లోనే చోరీకి గురవ్వడంతో లబోదిబోమంటున్నాడు బాధితుడు. శుక్రవారం ( జనవరి 30 ) హైదరాబాద్ లోని మీర్ పేట్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. ఈ సంఘటన మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధి బాలాపూర్ ఎక్స్ రోడ్ లో చోటు చేసుకుంది. 

బాలాపూర్ ఎక్స్ రోడ్ దగ్గర తన యాక్టివా పార్క్ చేసి వాటర్ బాటిల్ కొంటుండగా గుర్తుతెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడని బాధితుడు తెలిపాడు. 15 నుండి ఇరవై సెకండ్ లలో అక్టివా దొంగలించాడని అవేదన వ్యక్తం చేస్తున్నాడు బాధితుడు. కొన్న రెండు రోజుల్లోనే తన బైక్ చోరీకి గురవ్వడంతో లబోదిబోమంటున్నాడు బాధితుడు.

చేసేదేమీ లేక మీర్ పేట్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు బాధితుడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా బైక్ దొంగ కోసం గాలిస్తున్నారు పోలీసులు. బైక్ కొన్న ఆనందం రెండు రోజులు కూడా లేదు పాపం.. అంటూ బాధితుడి పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.