శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు డీఆర్ఐ అధికారులు. శనివారం ( జనవరి 31 ) ఎయిర్ పోర్టులో తనిఖీలు నిర్వహించిన అధికారులు రూ.9 కోట్ల 50 లక్షలు విలువజేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ట్రాలీ బ్యాగ్ లో 27.15 కేజీల హైడ్రోపోనిక్ గంజాయి తరలిస్తున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు అధికారులు. గంజాయి తరలిస్తున్న ప్రయాణికులు బ్యాంకాక్ నుంచి వస్తున్నట్లు తెలిపారు అధికారులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఇదిలా ఉండగా..కర్ణాటకలోని మైసూర్ లో భారీ డ్రగ్స్ రాకెట్ భయటపడింది. ఆ రాష్ట్ర నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో చేపట్టిన ఆపరేషన్ లో డ్రగ్స్ గుట్టు రట్టు అయ్యింది. మైసుర్ లోని హెబ్బల్ ఇండస్ట్రియల్ ఏరియాలో క్లీనింగ్ కెమికల్స్ కంపెనీపై అధికారులు దాడులు చేశారు. ఈ సంస్థలో మెఫెడోన్ తయరీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
►ALSO READ | ముగిసిన GHMC చివరి కౌన్సిల్ సమావేశం.. 2026-27 బడ్జెట్కు ఆమోదం
ఈ దాడిలో సుమారు రూ. 10 కోట్ల విలువైన డ్రగ్స్ తో పాటు, రూ. 25 లక్షలు, ఓ ఫోర్ట్యూనర్ కారు, డ్రగ్స్ తయారీకి ఉపయోగించే పలు రకాల కెమికల్స్ ను అధికారులు సీజ్ చేశారు. కాగా ఈ ఘటనలో రాజస్థాన్ కు చెందిన నలుగురు నిందితులను అధికారులు అరెస్ట్ చేశారు. గుజరాత్ లోని సూరత్ వద్ద గురువారం చేసిన తనీ ఖిల్లో ఓ డ్రగ్స్ వాహనం సీజ్ చేయడంతో ఈ డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చిందని నార్కోటిక్ అధికారులు వెల్లడించారు.
