IPL 2026 Mini-auction: CSK రిలీజ్ చేసినా అంతకు మించిన జాక్ పాట్.. రూ.18 కోట్లకు కోల్‌కతా జట్టులో చేరిన పతిరానా

IPL 2026 Mini-auction: CSK రిలీజ్ చేసినా అంతకు మించిన జాక్ పాట్.. రూ.18 కోట్లకు కోల్‌కతా జట్టులో చేరిన పతిరానా

శ్రీలంక యార్కర్ల వీరుడు మతీషా పతిరానాకు ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఊహించని ధర పలికింది. ఈ శ్రీలంక ఫాస్ట్ బౌలర్ ను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 18 కోట్లకు కొనుగోలు చేసింది. మంగళవారం (డిసెంబర్ 16) జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో పతిరానా కోసం బేస్ ప్రైస్ రూ. 2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ బిడ్డింగ్ ప్రారంభించింది. లక్నో సూపర్ జెయింట్స్ చేరి పోటీని రూ. 10 కోట్ల మార్కును దాటి ముందుకు తీసుకెళ్లింది. ఆ తర్వాత సడన్ గా కోల్‌కతా నైట్ రైడర్స్ బిడ్డింగ్‌లోకి వచ్చి ఈ 22 ఏళ్ల లంక పేసర్ ను రూ. 18 కోట్లకు దక్కించుకుంది

ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్‌ను రూ. 25.20 కోట్లకు కొనుగోలు చేసిన తర్వాత కేకేఆర్ రూ. 18 కోట్లతో పతిరాణాను దక్కించుకుంది. ఈ ఇద్దరు ప్లేయర్లకే కేకేఆర్ ఏకంగా రూ.43 కోట్లు ఖర్చు చేసాయడం విశేషం. గత ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ యువ సంచలనం మతీష పతిరానాని రూ.13 కోట్ల రూపాయలకు రిటైన్ చేసుకుంది. ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున  పతిరానా ఘోరంగా విఫలమయ్యాడు. 12 మ్యాచ్ ల్లో కేవలం 13 వికెట్లు పడగొట్టి అంచనాలను అందుకోలేకపోయారు. ఎకానమీ కూడా 10కి పైగా ఉండడంతో ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ ఈ యువ పేసర్ ను రిలీజ్ చేసింది.

ఓవరాల్ గా చెన్నై సూపర్ కింగ్స్ తరఫున పతిరానా 32 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ఎనిమిది కంటే ఎక్కువ ఎకానమీ రేటుతో 47 వికెట్లు పడగొట్టాడు. 2023లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలిచిన జట్టులో పతిరానా సభ్యుడు. చెన్నై కాకుండా తొలిసారి పతిరానా వేరే జట్టుకు ఆడబోతున్నాడు. ఓవరాల్ గా పతిరానా తన టీ20 కెరీర్ లో 99 మ్యాచ్ ల్లో 132 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ తో పాటు సౌతాఫ్రికా ప్రీమియర్ లీగ్, శ్రీలంక ప్రీమియర్ లీగ్ కూడా ఆడాడు. అంతర్జాతీయ టీ20ల్లో 21 మ్యాచ్ ల్లో 32 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.